Telangana: అబ్బా ఏం ప్లాన్ చేశారు రా.. పోలీసులకే సినిమా చూపించారు.. పుష్ప సినిమాను మించి హైటెక్ స్మగ్లింగ్..

Hanumakonda: పక్కా సమచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కారు... హసన్ పర్తి మీదుగా ఈ వాహనం వెళ్తుందన్న పక్కా సమాచారంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు పెంచికలపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర ఈ వాహనాన్ని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న డిసియం వ్యాన్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వ్యాన్ రిజిస్ట్రేషన్ పత్రాల్లోని వాహనం..

Telangana: అబ్బా ఏం ప్లాన్ చేశారు రా.. పోలీసులకే సినిమా చూపించారు.. పుష్ప సినిమాను మించి హైటెక్ స్మగ్లింగ్..
Three Quintals Of Ganja
Follow us
G Peddeesh Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 17, 2023 | 10:15 AM

వరంగల్, అక్టోబర్17; పుష్ప సినిమా మరిపించే తరహాలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా హైటెక్ స్మగ్లర్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.. ఆ స్మగ్లర్ల ప్లాన్ చూసి షాక్ అయిన పోలీసులు వారి నుండి పెద్ద మొత్తంలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ ముఠా నుండి 75 లక్షల విలువగల మూడు వందల కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాదినం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన కోలి రాజా వర్మ, మహారాష్ట్రకు చెందిన పార్టిల్ నామ్‌దేవ్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు..రాహుల్ సబులే, శుభం గోతీరామ్ సబులే, శేషుకుమార్ అనే మరో ముగ్గురు ప్రస్తుతం పరారిలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మూడు వందల కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు.. ఈ గంజాయిని రెండుకిలోల ప్యాకెట్ల రూపంలో తయారు చేసి పోలీసులకు చిక్కకుండా మాస్టర్ ప్లాన్ ఆలోచించారు..గంజాయి రవాణా కు వినియోగిస్తున్న డిసియం వ్యాన్ పై కప్పును సపరేట్ గా డిజైన్ చేసుకున్నారు. పై కప్పు పైన మరో లేయర్ ఏర్పాటు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా అందులో గంజాయి ప్యాకెట్లను భద్ర పరిచారు. ఇంటి పై కప్పు మీద పెంకులు అమర్చినట్లుగా గంజాయి ప్యాకెట్లను అమర్చి వాటి మీద తాడిపత్రితో మూసివేసి ఈ గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు..

ఇవి కూడా చదవండి

అప్పటికే సుమారు ఆరు వందల కిలో మీటర్లు ప్రయాణం చేశారు.. పదులు సంఖ్యలో పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక చెక్ పోస్టులు దాటి వచ్చారు.. వరంగల్ మీదుగా మహారాష్ట్రకు చేరుకునే రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు..ఈ క్రమంలో పక్కా సమచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కారు… హసన్ పర్తి మీదుగా ఈ వాహనం వెళ్తుందన్న పక్కా సమాచారంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు పెంచికలపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర ఈ వాహనాన్ని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న డిసియం వ్యాన్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వ్యాన్ రిజిస్ట్రేషన్ పత్రాల్లోని వాహనం తయారీ నంబర్ కు వాహనం ఇంజన్ పై వున్న నంబర్ కు తేడాను కూడా గుర్తించారు.

నిందితుల మాస్టర్ ప్లాన్ చూసి పోలీసులే షాక్ తిన్నారు.. డీసీఎం పై భాగంలో సపరేట్ గా ఏర్పాటు చేసుకున్న తీరు చూసి అవాక్కయ్యారు.. గంజాయి తో పాటు, వాహనం సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు పంపారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..