AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas War: ఆస్పత్రిపై దాడి వారిపనే సాక్ష్యం ఇదే.. ఇజ్రాయిల్ ఓ వీడియో రిలీజ్..

ఆసుపత్రిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన తరువాత, ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తమ పక్షాన్ని సమర్ధిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సాయంత్రం 6:15 గంటలకు హమాస్ నుండి ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత సాయంత్రం 6:59 గంటల ప్రాంతంలో స్మశానవాటిక నుండి ఇస్లామిక్ జిహాద్ దాదాపు పది రాకెట్లను ప్రయోగించింది.

Israel Hamas War: ఆస్పత్రిపై దాడి వారిపనే సాక్ష్యం ఇదే.. ఇజ్రాయిల్ ఓ వీడియో రిలీజ్..
Israel Hamas War
Surya Kala
|

Updated on: Oct 19, 2023 | 11:10 AM

Share

గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై మంగళవారం దాడి జరిగింది. ఈ దాడిలో 500 మందికి పైగా మరణించారు. ఈ ఘటన తర్వాత హమాస్ లేదా ఇజ్రాయిల్ ఎవరు ఆసుపత్రిపై దాడి చేశారనే ప్రశ్న తలెత్తింది. ఇద్దరూ ఎవరికీ వారు తమ తమ వాదనలు వినిపించారు. ఓ వైపు వీరి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు  ప్రపంచంలోని చాలా దేశాలు ఈ దాడిని మారణహోమంగా పరిగణించాయి. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడిందని.. ఆసుపత్రిని టార్గెట్ చేసిందని హమాస్ ఆరోపించింది.

హమాస్ చేసిన ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. తమ పై హమాస్ చేసిన ఆరోపణలు.. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇజ్రాయిల్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ఇజ్రాయిల్ ఆర్మీ రిలీజ్ చేసింది. హమాస్ చేసిన ఆరోపణల పై రష్యా శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేసింది,

ఇవి కూడా చదవండి

దాడిపై స్పందించిన ఇజ్రాయిల్

ఆసుపత్రిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన తరువాత, ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తమ పక్షాన్ని సమర్ధిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సాయంత్రం 6:15 గంటలకు హమాస్ నుండి ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత సాయంత్రం 6:59 గంటల ప్రాంతంలో స్మశానవాటిక నుండి ఇస్లామిక్ జిహాద్ దాదాపు పది రాకెట్లను ప్రయోగించింది. గాజా నగరంలోని ఆసుపత్రి నుండి పేలుడు వార్తలు రావడం మొదలైంది ఈ సమయంలోనే..

ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం సేకరించినప్పుడు..  అది ఇస్లామిక్ జిహాద్ రాకెట్ అని, దానిని ప్రయోగిస్తున్న సమయంలో మిస్ ఫైర్ అంటే విఫలమైందని తేలింది. ఆసుపత్రి దగ్గర నుండి విడుదల చేయబడింది. దాడి జరిగిన చోట కాలిన గాయాలు ఉన్నాయని, అయితే ఎలాంటి క్రేటర్స్ లేవని హగారి తెలిపారు. వైమానిక మందుగుండు సామగ్రిని విడుదల చేసి ఉంటే, దాడి చిత్రం భిన్నంగా ఉండేది. 450 హమాస్ రాకెట్లు మిస్ ఫైర్ గాజాలోనే పడిపోయాయి. పాలస్తీనియన్లు తమ తప్పుకు మూల్యం చెల్లించుకున్నారని పేర్కొన్నారు.

హమాస్ ఎలాంటి ఆరోపణలు చేసిందేనంటే.. 

ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆరోపించింది. అల్-అహ్లీ ఆసుపత్రిని ఖాళీ చేయడం గురించి ఇజ్రాయిల్ ఇంతకుముందు ప్రస్తావించిందని హమాస్ చెప్పింది. అల్-అహ్లీ ఆసుపత్రిపై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డాడు. జరిగిన దాడి కారణం అంటూ ఇజ్రాయిల్ ప్రభుత్వం వైపు తన వేలుని చూపుతుంది. ప్రజలు గాజాలోని అల్-అహ్లీ హాస్పిటల్‌తో సహా సమీపంలోని ఆసుపత్రులలో ఆశ్రయం పొందారు.

కాగా గాజాపై దాడి చేసిన వారు ఉగ్రవాదులని ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇంతకుముందు మన పిల్లలను చంపిన ఉగ్రవాదులు ఇప్పుడు వారి పిల్లలను చంపుతున్నారు.

ఇజ్రాయిల్ ప్రతిస్పందన తర్వాత, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ) ఇజ్రాయెల్ ఆరోపణలను తిరస్కరించింది. ఇజ్రాయిల్ ఆరోపణలు కల్పితమని పీఐజే ప్రతినిధి దావూద్ షహబ్ అన్నారు. సామాన్యులపై తాను చేసిన దాడిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో హెడ్‌ ఇస్మాయిల్‌ హనియా మాట్లాడుతూ.. ఆస్పత్రిలో జరిగిన ఘటనలు మారణహోమానికి సజీవ సాక్ష్యం అని అన్నారు. ఇజ్రాయిల్ ఎంత క్రూరమైనదో, ఏ స్థాయిలో తమకు భయపడిందో ఈ దాడి తెలియజేస్తోంది. ఈ దాడికి అమెరికానే కారణమని ఇస్మాయిల్ ఆరోపిస్తూ, ఇజ్రాయెల్ ప్రోద్బలంతో ఇదంతా చేసిందని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..