AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వత్తిలేని దీపం.. ఆకుతో దీపం వెలిగించడం చూస్తే.. ఔరా అనక మానరు.. ఎవరైనా..

ఆకే నూనెలో వత్తిగా మారి వెలుగులు చిమ్ముతుంది. ఇలాంటి విశేషం గల మొక్క ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో ఉంది. తేతలి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ప్రకృతి ప్రేమికుడు. ఆయన తన ఇంటి ఆవరణలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. అక్కడే ఈ వైవిద్య భరితమైన మొక్క కూడా పెరుగుతుంది. ఈ మొక్కను మలబార్ కాట్మింట్ అని పిలుస్తారు.

Andhra Pradesh: వత్తిలేని దీపం.. ఆకుతో దీపం వెలిగించడం చూస్తే.. ఔరా అనక మానరు.. ఎవరైనా..
Leaf Wicks For Deepam
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 17, 2023 | 11:42 AM

Share

దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపం చూపుతూ దేవునికి దీపం దర్శయామి అని మంత్రం చదువుతారు అర్చకులు. దీపం తన కాంతితో వెలుగునివ్వటమే కాదు మనలో చైతన్యం నింపుతుంది. అందుకే దీపావళి రోజు ఇళ్లంతా దీపాలతో అలంకరిస్తారు. ఇక కార్తీక మాసంలో నదులు, కాలువల్లో కార్తీక దీపాలను వదులుతారు. దీపం ఏ పేరుతో వెలిగించిన ప్రమిద, నెయ్యి లేదా నూనె, వత్తి ఈ మూడు అనివార్యం. వత్తిని దూదితో తయారు చేస్తారు. లేదా దూదిని దారంగా మార్చి వాటిని పేని వత్తిగాను వెలిగిస్తారు. అయితే దూదిలేని వత్తిని ఊహించగలమా..చమురును పీల్చుకుంటూ తను కాలుతూ వెలుగునిచ్చే వత్తిని ఒక చెట్టు ఆకు రీప్లేస్ చేస్తుంది. అవును ఇది నిజం. ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. నూనె వత్తులను సాధారణంగా పూర్వకాలంలో ఒక దీపారాధనకే కాదు కరెంటు లేని సమయాలలో ఇళ్లలో వెలుగుల కోసం కూడా ఉపయోగించేవారు. అయితే ఈ వత్తినీ పత్తి పంట దూదితోను, లేకపోతే వస్త్రాలతోనూ నూలు పోగులతో సహజంగా తయారు చేసి వాడుతారు. కానీ ఇపుడు మాత్రం వాటికి భిన్నంగా ఎప్పుడు, ఎవరూ చూడని వత్తి వెలుగులోకి వచ్చింది. అసలు ఆ వత్తి ప్రత్యేకత ఏమిటి..? దానిని దేనితో తయారుచేస్తారు.. ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకృతిలో పెరుగుతున్న మొక్కలకు అనేక ఔషధ గుణాలతో పాటు ప్రత్యేకంగా వున్న విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఓ పక్కన వత్తి అంటూ మరో పక్కన మొక్కల గురించి చెబుతున్నారు ఏంటి అని సందేహ పడుతున్నారా.. మీ సందేహం నిజమే.. ఆ వత్తి ఓ మొక్కలోని ఆకు. ఇది వత్తిగా వెలగడమే ఇక్కడ విశేషం. ఆకు వత్తిగా వెలగడం ఏమిటి.. అసలు అలాంటి ఆకులు ఉన్నాయా అని అనుకుంటున్నారా..

ఆకే నూనెలో వత్తిగా మారి వెలుగులు చిమ్ముతుంది. ఇలాంటి విశేషం గల మొక్క ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో ఉంది. తేతలి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ప్రకృతి ప్రేమికుడు. ఆయన తన ఇంటి ఆవరణలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. అక్కడే ఈ వైవిద్య భరితమైన మొక్క కూడా పెరుగుతుంది. ఈ మొక్కను మలబార్ కాట్మింట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం అనిసోమోలెస్ మలబారిక. అయితే ఈ మొక్క ఆకులు చాలా వైవిద్యంగా వస్త్రంలాగా మృదువుగా ఉంటాయి. అంతేకాక ఈ ఆకులకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆకును వత్తిలా చుట్టి నూనెలో ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. పచ్చటి ఆకు ఈ విధంగా వెలగటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

వత్తి సాధారణంగా ఒకవైపు పాత్రలో ఉన్న నూనెను పీల్చుకొని మరొకవైపు వెలుగుతూ కాంతులు వెదజల్లుతుంది. ఈ ఆకు కూడా ప్రత్యేకంగా నూనెను పీల్చుకుని వెలగడం ఎంతో వింతగా ఉందంటున్నారు స్థానికులు. అయితే ప్రతి ఆకు ఇలా వత్తిలా వెలగదు. ఇలా నూనెను పీల్చుకొని వత్తిలా వెలగడానికి దీనిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందని వృక్షశాస్త్ర అధ్యాపకులు చెబుతున్నారు. ఈ ఆకులలో భాష్పీభవన తైలాలు ఎక్కువగా ఉంటాయి.

ఆ కారణం చేతనే పాత్రలోని నూనెను వత్తిలా చేసిన ఈ ఆకు ఒకవైపు పీల్చుకుని మరొకవైపు అందులో ఉన్న భాష్పీభవన తైలాల ద్వారా మరొక వైపుకు చేరుకొని మండటానికి ఉపయోగ పడుతుంది. అంతేకాక ఈ ఆకులలో ఔషధ గుణాలుగా ఎక్కువగా ఉంటాయి. వీటిని నొప్పుల నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రకృతిలో సహజంగా దొరికే ప్రతి వస్తువు మనిషికి లాభదాయకమైనదే. ఎందులో ఏ లక్షణం ఉంటుందో తెలుసుకోవాలంటే ప్రతి దానిని పరిశోధించాల్సిందే..అందుకే ప్రకృతి మానవాళికి సంజీవిని లాంటిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..