AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: పుష్పగిరి క్షేత్రంలో కొనసాగుతున్న వజ్రాల వేట.. బతుకు మారుతుందనే ఆశతో జల్లెడపడుతున్న ప్రజలు..

కడప జిల్లా పుష్పగిరి కొండను జల్లెడ పడుతున్నారు ప్రజలు. వజ్రాల వేటను జోరుగా సాగిస్తున్నారు. కొత్తగా కనిపించిన ప్రతిరాయిని బుట్టలో వేసుకుంటున్నారు. పంచ నదిక్షేత్రమైన ఇక్కడ చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వర ఆలయం ఉన్నాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకేనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Kadapa: పుష్పగిరి క్షేత్రంలో కొనసాగుతున్న వజ్రాల వేట.. బతుకు మారుతుందనే ఆశతో జల్లెడపడుతున్న ప్రజలు..
Hunt For Diamonds
Surya Kala
|

Updated on: Oct 17, 2023 | 7:22 AM

Share

కడప జిల్లాలో వజ్రాల వేట జోరుగా సాగుతుంది. వల్లూరు మండలం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి క్షేత్రం కొండమీద వేల సంఖ్యలో ప్రజలు వజ్రాల వేట సాగిస్తున్నారు. కడప నుంచి 16 కి .మి.దూరంలో ఉన్న ఈ కొండకు ఉదయాన్నే చేరుకొని వజ్రాల కోసం వేతుకులాట సాగిస్తున్నారు. పుష్పగిరి కొండపై వజ్రాలు దొరికాయన్న ప్రచారంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకొని వజ్రాల వేట కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. కొండ కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నానది ప్రవహిస్తుంది. నది కూడా పాము ఆకారంలో ఉంటుంది. అలాగే పుష్పగిరికి సమీపంలో పాపాఘ్ని, కుమ్ముద్వతి, వల్కల, మాండవి నదులు కలుస్తున్నాయి. పంచ నది క్షేత్రమైన ఇక్కడ చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వర ఆలయం ఉన్నాయి.

జగద్గురువు ఆది శంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకేనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇంత గొప్ప చరిత్ర కల్గిన పుష్పగిరి కొండలో వజ్రాలు దొరుకుతున్నాయని టాక్ చక్కర్లు కొట్టడంతో కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వజ్రాల కోసం పుష్పగిరి కొండ చుట్టూ ప్రజలు జల్లెడ పడుతున్నారు. కొంచెం కొత్తగా ఏదైనా రాయి కనబడితే చాలు వాటిని సంచుల్లో వేసుకొని వజ్రాల కోసం గాలిస్తున్నారు. వజ్రాలు దొరికితే తమ బ్రతుకులు మారుతాయని ఆశతో వచ్చామని కొందరు చెబుతున్నారు. వజ్రాల వేట జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..