Navaratri 2023: నవగ్రహ దోషాలు తొలగించుకోవడానికి నవరాత్రుల్లో నవ దుర్గల పూజ విధానం మీకోసం
నవరాత్రి ఆరాధనతో దుర్గాదేవి ఆశీర్వాదం లభిస్తుందని తనను పూజించే భక్తులు కోరిన కోర్కెలు తీస్తుందని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో అమ్మవారిని ఆరాధించడం ద్వారా, నవగ్రహాల దోషాలను తొలగించుకోవచ్చు. ఈ నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం..
హిందూమతంలో నవరాత్రి పండుగ దుర్గాదేవి ఆరాధనకు చాలా పవిత్రమైనది.. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ ఆమెను పూజించడం, ఉపవాసం, మంత్రాలను జపించడం మొదలైన వాటిని పూర్తి ఆచార వ్యవహారాలతో ఆచరిస్తారు. నవరాత్రి ఆరాధనతో దుర్గాదేవి ఆశీర్వాదం లభిస్తుందని తనను పూజించే భక్తులు కోరిన కోర్కెలు తీస్తుందని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో అమ్మవారిని ఆరాధించడం ద్వారా, నవగ్రహాల దోషాలను తొలగించుకోవచ్చు. ఈ నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం..
శైలపుత్రి : హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రుల మొదటి రోజున పర్వత రాజు హిమాలయ కుమార్తె శైలపుత్రిని ఆరాధించడం వలన ఎవరి జాతకంలోనైనా కుజ దోషం ఉంటే ఆ దోషం తొలగిపోతుంది. అంగారకుడి వలన జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల నుండి ఉపశమనం లభిస్తుంది.
బ్రహ్మచారిణి : నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం దుర్గాదేవి ఈ పవిత్ర రూపాన్ని పూజిస్తే.. జాతకంలోని ఛాయా గ్రహం అంటే రాహువు దోషాలు తొలగిపోతాయి.
చంద్ర గంట : దుర్గాదేవి ఈ పవిత్ర రూపం చంద్ర గంట. ఈమె చంద్రుడిని ధరించి కరుణ కలిగి దర్శనం ఇస్తుంది. హిందూ విశ్వాసం ప్రకారం ఈ దేవిని పూజించడం ద్వారా జాతకంలో చంద్ర దోషం తొలగిపోతుందని నమ్ముతారు.
కూష్మాండ దేవి : నవరాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవిని ఆరాధించడం ద్వారా ఆనందాన్ని, సౌభాగ్యాన్ని పొందడమే కాకుండా.. జాతకంలో కేతువుకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి. దీని వల్ల జీవితంలో కలిగే అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది.
స్కందమాత : హిందూ విశ్వాసం ప్రకారం శక్తి ఆరాధనలో మాత స్కందమాత పేరుతో దుర్గాదేవి కుమారుడైన కార్తికేయుడు పూజించబడతాడు. మాత స్కందమాతను పూజించడం వల్ల మనిషి జాతకంలో సూర్యునికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
కాత్యాయని : సనాతన ధర్మం ప్రకారం నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయన మహర్షి తపస్సుకు సంతసించి అతని ఇంట్లో జన్మించిన కాత్యాయని దేవిని పూజిస్తారు. కాత్యాయని దేవిని పూజించడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుందని.. బుధుడికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
కాళరాత్రి : నవరాత్రులలో ఏడవ రోజు కాళరాత్రి ఆరాధన ను చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం కాళరాత్రిని ఆరాధించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టాలైనా రెప్పపాటులో తొలగిపోతాయి. సాధకుడు శని దోషం నుండి విముక్తి పొందుతాడు.
మహాగౌరి : శక్తి సాధనలో మహాగౌరీ దేవీ ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అమ్మవారిని ఆరాధించడం, పూజించడం ద్వారా దేవగురువు బృహస్పతి ఆశీర్వాదం లభిస్తుందని.. ఆనందం, అదృష్టాన్ని పొందుతాడని నమ్ముతారు.
సిద్ధిదాత్రి : నవరాత్రుల చివరి రోజున దుర్గాదేవి.. సిద్ధిదాత్రి రూపాన్ని పూజిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం, సిద్ధిదాత్రీ దేవిని ఆరాధించడం ద్వారా అన్ని రకాల పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. అతని జాతకంలో శుక్ర దోషం ఉంటే.. ఆ దోషం తొలగి శుభాన్ని పొందుతాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.