Horoscope Today: వారు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దినఫలాలు (అక్టోబర్ 17, 2023): మేష రాశి వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందవద్దు. అన్నీ సవ్యంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి దినఫలాలు ఎలా ఉన్నయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 17th October 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 17, 2023 | 5:01 AM

దినఫలాలు (అక్టోబర్ 17, 2023): మేష రాశి వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందవద్దు. అన్నీ సవ్యంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి దినఫలాలు ఎలా ఉన్నయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సానుకూల వైఖరితో ప్రయత్నాలు ప్రారంభించండి. అన్నీ అనుకూలంగా జరిగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, ఇంక్రిమెంట్ రూపేణా ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగం వారు, రాజకీయ నాయకులు ఆశించిన ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. వ్యాపారాలు సజావుగా, సానుకూ లంగా సాగిపోతాయి. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. సతీమణిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కొందరు బంధువులతో లేదా సన్నిహితులతో తలెత్తిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త ఆలోచ నలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తి గత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందవద్దు. అన్నీ సవ్యంగా పూర్తవుతాయి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. సానుకూల దృక్పథంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఏదో విధంగా ముఖ్యమైన పనులు సకా లంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి కానీ, ఉద్యోగంలో మాత్రం అధికారుల నుంచి ఇబ్బందులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగి స్తుంది. గృహం కొనుగోలు వ్యవహారంలో రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంగా హ్యాపీగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశాల నుంచి మంచి ఆఫర్లు రావడం గానీ, శుభవార్తలు వినడం గానీ జరుగుతుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు. అయినప్పటికీ రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారా లను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్త వుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం చాలావరకు బాగుంటుంది. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరు స్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొన్నివ్యక్తిగత, కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులతో కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను తలకెత్తు కునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల్లో ఒకరికి చదువుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో ముందుకు దూసుకు వెడతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు తగిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

తోబుట్టువులతో అపార్థాలు తొలగిపోయి, సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవు తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, కుటుంబపరంగా కూడా అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. పిల్లల నుంచి, సతీమణి నుంచి శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు మామూలు చేరాల్సి వస్తుంది. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు అను కూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. బాగా దగ్గర బంధువు లతో ఉన్న సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నవారు మరింత ఉత్సాహంగా పని చేసి అంచనాలకు తగ్గట్టు లాభాలు అందుకుంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.