Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Transit 2023: మేష రాశిలోకి రాహువు సంచారం.. ఆ రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహంతో ఆకస్మిక ధన లాభం..!

ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న గురువు రాహువుతో కలిసి ఉండ వలసిన పరిస్థితి ఏర్పడడం వల్ల గురు చండాల యోగం ఏర్పడింది. ఈ రాహువు ఈ నెల 31 నుంచి గురువును వదిలిపెట్టి మీన రాశిలోకి వెడుతున్నందువల్ల మేష రాశిలో ఒంటరిగా మిగిలిపోయిన గురువు పూర్తి స్థాయిలో తానివ్వవలసిన శుభ ఫలితాలనిస్తాడు.

Rahu Transit 2023: మేష రాశిలోకి రాహువు సంచారం.. ఆ రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహంతో ఆకస్మిక ధన లాభం..!
Guru Rahu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 17, 2023 | 6:48 PM

జ్యోతిష శాస్త్రంలో ధన కారకుడు, భాగ్య కారకుడుగా గుర్తింపు పొందని గురు గ్రహం ఏ రాశివారి నైనా అనుగ్రహిస్తే ఆ రాశివారికి జీవితంలో తిరుగుండదు. సహజ శుభ గ్రహమైన గురువు జాతక చక్రంలో అనుకూలంగా ఉన్నపక్షంలో జాతకులు ఐశ్వర్యవంతులు, అదృష్టవంతులు కావడం ఖాయమని చెప్పవచ్చు. ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న గురువు రాహువుతో కలిసి ఉండ వలసిన పరిస్థితి ఏర్పడడం వల్ల గురు చండాల యోగం ఏర్పడింది. ఈ రాహువు ఈ నెల 31 నుంచి గురువును వదిలిపెట్టి మీన రాశిలోకి వెడుతున్నందువల్ల మేష రాశిలో ఒంటరిగా మిగిలిపోయిన గురువు పూర్తి స్థాయిలో తానివ్వవలసిన శుభ ఫలితాలనిస్తాడు. దీని ఫలితంగా, మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశి వారి మీద కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు.

  1. మేషం: ఈ రాశిలో సంచరిస్తున్న గురువు వల్ల ఈ రాశివారికి ఈ నెల 31 తర్వాత నుంచి ఖాయంగా రాజ యోగం పట్టబోతోంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుని, రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడు తుంది.
  2. మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువు త్వరలో ఈ రాశివారికి సిరులు పండించడం ప్రారంభం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనూహ్యంగా రాబడి పెరుగుతుంది. స్థిరాస్తుల విలువ అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. రియల్టర్లు, రాజకీయ నాయకులు, సినిమా రంగానికి చెందినవారు ఘన విజయాలు సాధిస్తారు. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం పొందుతారు.
  3. సింహం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల తప్పకుండా భాగ్య యోగం పడుతుంది. విదేశీ డబ్బు సంపాదించడం జరుగుతుంది. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. ఆదాయానికి మెరుగుపరచుకోవడానికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. తప్పకుండా తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదం, కోర్టు వివాదం పరిష్కారం అవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టడానికి ఆస్కారముంది. ఆరోగ్యం అనుకూలంగా మారు తుంది.
  4. తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురువు కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా విశేషమైన లాభా లను చేకూరుస్తాడు. సతీమణికి కూడా అదృష్ట యోగం పడుతుంది. అవివాహితులు సంపన్న కుటుంబంలో సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన దాని కంటే మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి నాథుడైన గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా విశేషమైన లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక సంబంధమైన వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, జీవి తంలో స్థిరపడడం జరుగుతుంది. భారీ జీతభత్యాలతో కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలు న్నాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో బాగా రాణి స్తారు.
  6. మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు ధన స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా ఆదాయం పెర గడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటివి జరుగుతాయి. ఆర్థికంగా ఇతరులకు మేలు చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడం, జీతభత్యాలు బాగా పెరగడం జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి.

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ