Indrakeeladri: నేడు శ్రీ మహా చండిదేవి అలంకారంలో దుర్గమ్మ.. తెల్లవారు జామునుంచే మొదలైన దర్శనం..

ప్రతి ఏటా ఐదవరోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఈ సారి చండి అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ ఏడాది అధిక శ్రవణం, తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావటంతో ఈ ఏడాది అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు.

Indrakeeladri: నేడు శ్రీ మహా చండిదేవి అలంకారంలో దుర్గమ్మ.. తెల్లవారు జామునుంచే మొదలైన దర్శనం..
Sri Maha Chandi Devi
Follow us
Surya Kala

|

Updated on: Oct 19, 2023 | 6:46 AM

70 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకాం ప్రత్యేకత ఏంటి? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అలంకరించారంటే..? ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి అయిన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఐదవరోజుకు చేరాయి. ఇవాళ మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది.. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే అంటున్నారు పండింతులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం ఏ కోర్కెలకోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయనేది విశ్వాసం.

ప్రతి ఏటా ఐదవరోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఈ సారి చండి అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ ఏడాది అధిక శ్రవణం, తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావటంతో ఈ ఏడాది అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్యకాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీహోమాలు జరుగుతుండటంతో.. అమ్మవారికి చండీ అలంకారం వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు.

నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే రెండు లక్షల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇవాళ ప్రత్యేక అలంకారం కావడంతో భారీస్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!