Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. అధికారిక వెబ్‌సైట్‌ను పూర్తిగా మార్చేసిన టీటీడీ.. పూర్తి వివరాలివే
శ్రీవారి భక్తులకు అలెర్ట్..ఏడు కొండల స్వామి దర్శనార్థం వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల టిక్కెట్లను ఇవాళ (అక్టోబర్ 18) విడుదల చేసింది
శ్రీవారి భక్తులకు అలెర్ట్..ఏడు కొండల స్వామి దర్శనార్థం వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల టిక్కెట్లను ఇవాళ (అక్టోబర్ 18) విడుదల చేసింది. ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. అలాగే శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచుతారు.
టీటీడీ వెబ్ సైట్ మారింది..
కాగా తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబరు 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. కాగా ఇది వరకు భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ tirupatibalaji.ap.gov.in అని ఉండగా టికెట్లు బుక్ చేసుకునేవారు. అయితే తాజాగా ఆ పేరును ttdevasthanams.ap.gov.in అని మార్చారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, నకిలీ వెబ్ సైట్లతో మోసపోవద్దని టీటీడీ సూచించింది.
టీటీడీ ట్విట్టర్ పోస్ట్..
As part of the ‘One Organization, One Website, and One Mobile App’ concept, our TTD official online booking website https://t.co/CMhAhyqqiT has been changed to https://t.co/2J0qkUfXpu.
From now onwards, please use the https://t.co/2J0qkUfXpu website for online bookings. pic.twitter.com/JyPBD1Jq3P
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 13, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి