తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో రూ.46 కోట్ల‌తో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్..దేశవాళీ గో జాతుల అభివృద్ధికి పెద్ద పీట..

మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ ద్వారా ఐదేళ్ల కాలంలో రూ. 4614.50 లక్షల కార్పస్ ఫండ్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్ర‌తి రోజు తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వర స్వామి అన్ని సేవల‌కు 60 నుంచి 100 కిలోల నెయ్యి, మూడు వేల‌ లీటర్లపాలు దేశవాళీ గో జాతుల నుండి ఉత్ప‌త్తి చేయ‌డానికి దేశవ‌ళి గోవుల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీటీడీ ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు.

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో రూ.46 కోట్ల‌తో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్..దేశవాళీ గో జాతుల అభివృద్ధికి పెద్ద పీట..
Tirumala Temple
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 18, 2023 | 1:54 PM

తిరుమల18, అక్టోబరు 2023: దేశవాళీ గో జాతుల అభివృద్ధిలో టిటిడి మరో అడుగు ముందుకేసింది. జన్యుపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణ శాలలో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, టీటీడీ సంయుక్తంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తిరుమలలో టిటిడి ఈవో ధర్మారెడ్డి అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, శ్రీ‌జ మ‌హిళా మిల్క్ ప్రొడ్యుస‌ర్ ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌దేవి, ఎన్‌డిడిబి ఎండి డా. దేవానంద్‌, టిటిడి జేఈవో సదా భార్గవి, ఎఫ్ఎ అండ్ సిఎవో బాలాజి తో చర్చించారు.

Ttd Board Members

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ ద్వారా ఐదేళ్ల కాలంలో రూ. 4614.50 లక్షల కార్పస్ ఫండ్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్ర‌తి రోజు తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వర స్వామి అన్ని సేవల‌కు 60 నుంచి 100 కిలోల నెయ్యి, మూడు వేల‌ లీటర్లపాలు దేశవాళీ గో జాతుల నుండి ఉత్ప‌త్తి చేయ‌డానికి దేశవ‌ళి గోవుల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీటీడీ ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు.

జన్యు మార్పిడి ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృత్రిమ గర్భధారణ, పిండ బదిలీ వంటి అధునాతన పునఃరుత్పత్తి సాంకేతికతలపై కేంద్రం దృష్టి సారిస్తోంద‌న్నారు. జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, డెయిరీ సర్వీసెస్, రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఎన్‌డిడిబి విడుదల చేసిన నిధుల ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుందన్నారు ఈవో ధర్మారెడ్డి. టీటీడీకి చెందిన ఎస్వీ గోసంరక్షణ శాలలో ఇప్పటికే దేశీ గోవుల పెంపకం, అభివృద్ధి దిశగా అనేక‌ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..