Rose Water: రోజ్ వాటర్‌తో మెరిసే అందం మీ సొంతం.. ఇలా అప్లై చేయండి..! మార్పు మీరే చూస్తారు..
చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన చెమట, మురికిని తొలగించడానికి రోజ్ వాటర్‌ను ముఖానికి రాసుకోవడం కూడా మంచిది. అలాగే, చర్మంపై ఏర్పడ ముడతల నివారణకు కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది. ఇందుకోసం గులాబీ రేకులతో
రోజ్ వాటర్ ఏ రకమైన చర్మానికి అయినా ఉపయోగించవచ్చు. ఇది చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ముఖంపై పేరుకున్న జిడ్డును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రోజ్ వాటర్ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో, చర్మాన్ని మృదువుగా చేయడంలో, వయసు సంబంధిత ముడతలు మరియు నల్ల మచ్చలను తొలగిస్తుంది. రోజ్ వాటర్ ఏ రకమైన చర్మానికి అయినా ఉపయోగించవచ్చు. ఇది చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది మరియు ముఖం యొక్క జిడ్డును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ను ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని రోజ్ వాటర్ ను ముఖానికి రాసుకుని నిద్రించండి. మర్నాడు ఉదయం ముఖం కడుక్కోవాలి. కాటన్ క్లాత్‌ను రోజ్ వాటర్‌లో ముంచి, ముఖాన్ని తరచుగా తుడవడం వల్ల నల్ల మచ్చలు తొలగిపోతాయి. మొటిమలను వదిలించుకోవడానికి కూడా రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ లో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన చెమట, మురికిని తొలగించడానికి రోజ్ వాటర్‌ను ముఖానికి రాసుకోవడం కూడా మంచిది. అలాగే, చర్మంపై ఏర్పడ ముడతల నివారణకు కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది. ఇందుకోసం గులాబీ రేకులతో మరిగించిన గోరువెచ్చని నీరు లేదంటే బయటి నుంచి కొనుగోలు చేసిన రోజ్ వాటర్ ముఖానికి రాసుకోవచ్చు. కళ్ల చుట్టూ నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది. ఇందుకోసం ఫ్రిజ్‌లో చల్లబర్చిన రోజ్ వాటర్‌లో కాటన్ బాల్‌ను నానబెట్టండి. తర్వాత ఈ దూదిని కళ్లపై కాసేపు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. మేకప్ తొలగించేందుకు కూడా రోజ్ వాటర్ వినియోగిస్తారు. మేకప్ రిమూవర్లకు ప్రత్యామ్నాయంగా రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. ఇవి చాలా సులభంగా మేకప్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి