Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయా.. అయితే అద్దాన్ని ఈ దిక్కుకు మార్చేయండి!

సాధారణంగా అందరి ఇళ్లలో అద్దాలు ఉండటం సర్వ సాధారణమైన విషయం. అయితే అవి ఏ దిక్కుల్లో ఉంటాయన్నదే అసలైన సమస్యలు. కొన్ని దిక్కుల్లో అద్దాలను ఉంచితే కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో సమస్యలు, గొడవలు ఎక్కువగా ఉన్నట్లై ముందు వాటి ప్లేస్ ని మార్చేయండి. వాస్తు ప్రకారంగా చూస్తే కొన్ని రకాల వస్తువులను కొన్ని చోట్ల పెట్టడం వల్ల సానుకూల ప్రతికూల శక్తులకు మూలం అవుతాయి. అంతే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రతికూల..

Vastu Tips: మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయా.. అయితే అద్దాన్ని ఈ దిక్కుకు మార్చేయండి!
Mirror
Follow us
Chinni Enni

|

Updated on: Oct 18, 2023 | 2:47 PM

సాధారణంగా అందరి ఇళ్లలో అద్దాలు ఉండటం సర్వ సాధారణమైన విషయం. అయితే అవి ఏ దిక్కుల్లో ఉంటాయన్నదే అసలైన సమస్యలు. కొన్ని దిక్కుల్లో అద్దాలను ఉంచితే కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో సమస్యలు, గొడవలు ఎక్కువగా ఉన్నట్లై ముందు వాటి ప్లేస్ ని మార్చేయండి. వాస్తు ప్రకారంగా చూస్తే కొన్ని రకాల వస్తువులను కొన్ని చోట్ల పెట్టడం వల్ల సానుకూల ప్రతికూల శక్తులకు మూలం అవుతాయి. అంతే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. మరి వాస్తు ప్రకారం అద్దాలను ఏ దిక్కున పెట్టాలి? ఎటు వైపు పెట్టకూడదో తెలుసుకుందాం.

ఈ దిక్కుల్లో అద్దాలను అస్సలు పెట్టకండి:

అద్దాన్ని ఎప్పుడూ పడమర లేదా దక్షిణం దిశలో ఉంచకూడదు. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఈ దిశలలో గాజు వస్తువులు ఉన్నా తీసేయాలి. ఎందుకంటే ఈ దిక్కులలో అద్దం పెట్టడం వల్ల ఆ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటి సభ్యుల మధ్య విబేధాలు పెరిగి రోజు రోజుకూ సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ దిక్కుల్లో అద్దాలను అస్సలు ఉంచకండి.

ఇవి కూడా చదవండి

పగిలిన అద్దాలను ఉంచవద్దు:

పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచకూడదలు. పగిలిన అద్దాల్లో ముఖాన్ని కూడా చూసుకోకడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, దీంతో సమస్యలు, ఆర్థిక వృద్ధి కుంటు పడుతుంది.

బెడ్ రూమ్ లో అద్దాలను ఉంచకండి:

చాలా మంది పడక గదిలో అద్దాలను ఉంచుకుంటారు. నిద్ర లేవగానే అద్దంలో మీ ముఖం చూస్తారు. ఇలా చేయడం వల్ల అపజయాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వేళ బెడ్ రూమ్ లో అద్దాలను ఉంచినా.. లేవగానే మీ ముఖం చూసుకోకూడదు. స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రమే చూసుకోవాలి.

బాత్రూమ్ లో ఉంచకూడదు:

ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా బాత్రూమ్ లో కూడా అద్దాలను ఎక్కువగా పెడుతున్నారు. అద్దంలో బోల్డ్ గా ఉన్న వ్యక్తుల చిత్రం అస్సలు కనిపించకూడదు. కాబట్టి వీలైనంత వరకూ బాత్రూమ్ లో అద్దాలను పెట్టుకోకపోవడమే బెటర్. అలాగే మసకబారిన అద్దాల్లో కూడా ముఖాన్ని చూసుకోకూడదు.

అద్దాలను అసలు ఎక్కడ పెట్టాలి:

వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాలను ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. ఈ దిక్కుల్లో అద్దాలు ఉంటే శుభ ప్రదం. ఉత్తర దిక్కు.. కుబేర దిక్కు. కాబట్టి ఈ దిక్కులో అద్దాన్ని ఉంచితే డబ్బును ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లి విరుస్తుంది. కాబట్టి ఒకవేళ ఇంట్లో సమస్యలు ఏమైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే అద్దాల ఉండే ప్లేస్ ను మార్చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.