Spiritual Dreams: దసరా శరన్నవరాత్రుల్లో ఈ ఐదు కలలు ఉంటే.. శుభ సూచికం!

దేశ వ్యాప్తంగా దసరా నవ రాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. అమ్మవారిని ప్రాంతలను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజిస్తారు. ఎలా పూజించినా.. అమ్మవారు మాత్రం ఒక్కటే. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. ఈ నవ రాత్రుల్లో ఏ గుడి చూసినా మహిళా భక్తులతో కిట కిటలాడుతూ ఉంటుంది. కుంకుమ పూజలు, హోమాలు వంటి పూజలతో ఆలయాలన్నీ కిక్కిరిసి పోతాయి. అమ్మవారు తమను కరుణించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇంకొందరు ఇదే సమయంలో భవానీ మాలలు కూడా వేసుకుని..

Spiritual Dreams: దసరా శరన్నవరాత్రుల్లో ఈ ఐదు కలలు ఉంటే.. శుభ సూచికం!
Dugar Matha
Follow us
Chinni Enni

|

Updated on: Oct 18, 2023 | 2:59 PM

దేశ వ్యాప్తంగా దసరా నవ రాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. అమ్మవారిని ప్రాంతలను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజిస్తారు. ఎలా పూజించినా.. అమ్మవారు మాత్రం ఒక్కటే. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. ఈ నవ రాత్రుల్లో ఏ గుడి చూసినా మహిళా భక్తులతో కిట కిటలాడుతూ ఉంటుంది. కుంకుమ పూజలు, హోమాలు వంటి పూజలతో ఆలయాలన్నీ కిక్కిరిసి పోతాయి. అమ్మవారు తమను కరుణించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇంకొందరు ఇదే సమయంలో భవానీ మాలలు కూడా వేసుకుని.. తమ కష్టాలన్నీ పోవాలని వేడుకుంటూ ఉంటారు.

దుర్గమ్మ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. అమ్మ అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ నవ రాత్రుల్లో ఎంతో నియమ నిబద్ధతలతో అమ్మవారిని కొలుస్తారు. అయితే ఈ దేవీ శరన్నవరాత్రుల్లో కొన్ని కలలు వస్తే శుభం కలుగుతుందని పెద్దలు చెప్తూంటారు. ఆ కలలు వస్తే దుర్గా మాత అనుగ్రహంతో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవిస్తారని అంటూంటారు. మరి ఆ కలలు ఏంటి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కనక దుర్గమ్మ తల్లి విగ్రహం కనిపించడం:

ఇవి కూడా చదవండి

ఈ నవ రాత్రుల్లో కనక దుర్గమ్మ తల్లి విగ్రహం కనిపిస్తే చాలా మంచిది. ఈ కల మీకు వస్తే దుర్గా దేవి అనుగ్రహం ఉందని సూచిస్తుంది.

సింహ వాహనంపై అమ్మవారు:

సింహ వాహనంపై అమ్మవారు స్వారీ చేస్తున్నట్టు అమ్మవారు కనిపిస్తే.. మీరు అనుకున్న పనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. అంతే కాకుండా జీవితంలో సాను కూల మార్పులు ఉన్నట్టు అమ్మవారు తెలుపుతున్నట్టే.

అమ్మ వారి అలంకరణ వస్తువులు:

అమ్మవారిని అలంకరణ వస్తువులు అంటే గాజులు, కుంకుమ, పసుపు, ఎరుపు రంగు వంటి వస్తువులు కనిపిస్తే.. మీ సమస్యలకు ముగింపు దొరికినట్టే అని సంకేతంగా భావించవచ్చు.

ఏనుగుపై అమ్మవారు కనిపిస్తే:

ఏనుగుపై దుర్గమ్మ తల్లి స్వారీ చేస్తున్నట్టు కలలో కనిపిస్తే.. విజయానికి సంకేతంగా మనం భావించవచ్చు. అంటే మన చేయబోయే పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతాయని భావించవచ్చు.

పాలు లేదా పాల ఉత్పత్తులు కనిపిస్తే:

కలలో పాలు లేదా పాల ఉత్పత్తులు కనిపించడం వల్ల విజయంతో పాటు సమాజంలో గౌరవం లభిస్తున్నట్టు మనం భావించవచ్చు.

ఇలా వీటిల్లో ఎలాంటి కలలు వచ్చినా అమ్మవారి అనుగ్రహం మనకు సిద్ధిస్తుందని, అమ్మవారి క్రుపకు పాత్రులం అవుతామని భావించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.