AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Asia CEO Post: వీడేంట్రా బాబు ఇంత వెరైటీగా ఉన్నాడు.. సీఈవో అయుండి వీడియో కాన్ఫరెన్స్‌ లో ఇలా..?

షర్ట్‌ లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌కి అటెండ్‌ అవడంపై టోనీ ఫెర్నాండెజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మసాజ్‌ చేసుకుంటూ మీటింగ్‌కు హాజరవ్వడమే కాకుండా తన వర్క్‌ స్టైల్ ఇదేనంటూ సీఈఓ లింక్డిన్‌లో పోస్ట్‌ పెట్టారు. మసాజ్‌ చేసుకుంటూ మీటింగ్‌కు హాజరైనట్లు ఆయనే స్వయంగా ఫొటోను పోస్ట్‌ చేశారు. పోస్ట్‌ పెట్టిన కాసేపటికే వైరల్‌గా మారింది. ఆయన చేసిన పోస్ట్‌ ఏమాత్రం సభ్యత అనిపించుకోదంటూ..

Air Asia CEO Post: వీడేంట్రా బాబు ఇంత వెరైటీగా ఉన్నాడు.. సీఈవో అయుండి వీడియో కాన్ఫరెన్స్‌ లో ఇలా..?
Air Asia Ceo Post
Jyothi Gadda
|

Updated on: Oct 18, 2023 | 10:47 AM

Share

మీరు లింక్డ్‌ఇన్‌లో అతిపెద్ద వ్యాపారవేత్తలు, నిపుణుల ప్రొఫైల్‌లను చూస్తుంటారు. సాధారణంగా ఉద్యోగ సంబంధిత అప్‌డేట్‌లు, చిట్కాలు-ట్రిక్స్ ఇక్కడ కనిపిస్తాయి. అయితే తాజాగా ఎయిర్ ఏషియా సీఈవో చేసిన పోస్ట్ ఒకటి ఇంటర్‌నెట్‌లో సంచలనంగా మారింది. మలేసియన్ ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను చొక్కా లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు. ఈ సమాచారాన్ని ఆయన స్వయంగా లింక్డ్‌ఇన్‌లో షేర్‌ చేశారు.

మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏషియా సీఈఓ తీరు వివాదస్పదమైంది. షర్ట్‌ లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌కి అటెండ్‌ అవడంపై టోనీ ఫెర్నాండెజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మసాజ్‌ చేసుకుంటూ మీటింగ్‌కు హాజరవ్వడమే కాకుండా తన వర్క్‌ స్టైల్ ఇదేనంటూ సీఈఓ లింక్డిన్‌లో పోస్ట్‌ పెట్టారు. మసాజ్‌ చేసుకుంటూ మీటింగ్‌కు హాజరైనట్లు ఆయనే స్వయంగా ఫొటోను పోస్ట్‌ చేశారు. పోస్ట్‌ పెట్టిన కాసేపటికే వైరల్‌గా మారింది. ఆయన చేసిన పోస్ట్‌ ఏమాత్రం సభ్యత అనిపించుకోదంటూ యూజర్‌ కామెంట్‌ చేస్తున్నారు. పోస్ట్ పై విమర్శలు వచ్చినప్పటికీ ఫెర్నాండెజ్‌ సదరు పోస్ట్‌ను డిలీట్‌ చేయలేదు.

ఇవి కూడా చదవండి

అయితే, వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ పెడుతున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది వినియోగదారులు ఇది సరైన పద్ధతి కాదంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా, మరొకరు..మన బాడీ ఎలా ఉందో కూడా లెక్కచేయకుండా షర్ట్ లేకుండా జనాల్లోకి వెళ్లడంలో ఫెర్నాండెజ్ చూపిన ధైర్యం ప్రశంసనీయం అని మరో యూజర్ చెప్పారు. షర్ట్ లెస్ గా ఉండాలంటే సిక్స్ ప్యాక్ ఉండాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి