- Telugu News Photo Gallery Srisailam navratri 2023 srishaila bhramarambi in chandraghanta alankaram Telugu News
Srisailam Navratri 2023: చంద్రఘంట అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక.. రావణ వాహన సేవలో భక్తులు..
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Updated on: Oct 18, 2023 | 8:53 AM

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో పూజిస్తారు భక్తులు. ఆలయాలను బట్టి అమ్మవారి అలంకారాలు మారుతుంటాయి. అయితే, శ్రీశైలంలో మాత్రం అమ్మవారు.. నవదుర్గల్లో మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి కాగా..మూడో రోజు చంద్రఘంటగా దర్శనమిస్తోంది శ్రీశైలం భ్రమరాంబిక.

మూడవ రోజు భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది.

ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారిని పలురకాల పూలతో అలంకరించారు. బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.

శ్రీ భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు రావణ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూరహారతులిచ్చారు.

అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవం కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, పలువురు ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపులు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చంద్రఘంట దేవిని పూజించడం వల్ల భయాలు తొలగిపోతాయి. బతుకుపై ఆశ, విశ్వాసం పెరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి నుదుటి మీద ఉన్న చంద్రుని గంట ధ్వని ఆత్మలను చెడు శక్తులను పారద్రోలేదిగా ఉంటుంది. అందుకే చంద్రఘంటను పూజించే ఇంట్లో ప్రతికూల శక్తులు చేరవు.

జీవితంలో వృత్తి, వ్యాపార రంగాల్లో నష్టపోయి, ఆశలను కోల్పోయిన సమయంలో చంద్రఘంట అమ్మవారిని పూజించటం వల్ల నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని పండితులు చెబుతారు. అందుకే భక్తులు ప్రగాఢ విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకుంటారు.
