Onion Price : సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరుగుతున్న ఉల్లిపాయ ధరలు.. కేజీ ఎంత కావచ్చంటే..?

ఒకవైపు పూల ధరలు మరొకవైపు బంగారం ధరలు ఇప్పుడు నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు మాత్రం ఏదీ  కొనలేని పరిస్థితి నెలకొంది. ఉల్లి లేనిది ఏ కూర ఉండదు అలాంటి ఉల్లి ఇప్పుడు సామాన్యుల కు కన్నీరు పెట్టిస్తోంది... అటు వినియోగదారులకు ఇటు కన్జ్యూమర్లకు ఉల్లి కొనాలి అన్న వాడాలి అన్న కష్టతరంగా మారింది

Onion Price : సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరుగుతున్న ఉల్లిపాయ ధరలు.. కేజీ ఎంత కావచ్చంటే..?
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 18, 2023 | 9:28 AM

నగరంలో ఉల్లి ధర రోజు రోజుకు పెరుగుతోంది… మహారాష్ట్ర నుంచి దిగుబడి అయ్యేటటువంటి ఉల్లి ధర దాని ఘాటు మలక్పేట్ ఉల్లి మార్కెట్లు తగులుతుంది.. సామాన్య ప్రజలు ఉల్లిగడ్డను కొనాలంటేనే జంకుతున్నారు.. మొన్నటివరకు టమాటా ధరలకు అల్లాడిన జనం ఇప్పుడు ఉల్లి కొనాలంటే భయపడుతున్నారు.. ధరలు పెరిగే కొద్దీ నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి ..దీంతో సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి.. తాజాగా ఉల్లి ధరలు 30 శాతం వరకు ధర పెరగడంతో కొనేందుకు అల్లాడుతున్నారు జనం.. ఇప్పటికే ఎన్నికల కోడ్ సమీపించిన వేళ ఉల్లి ధర పెరగడంతో భారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పై పడే అవకాశం ఉందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది…

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు అలాంటి ఉల్లి ధర ఇప్పుడు ఆకాశాన్ని వైపు చూస్తోంది మున్నా కిలో ఉల్లి ధర 15 రూపాయలు ధరపాలకగా నిన్న అదే ఉల్లి ధర 32 రూపాయలు ధర పలికింది అమాంతంగా డబల్ అయినటువంటి ఉల్లి ధర నిన్న ఏకంగా 42 రూపాయలు కిలో ఉల్లి ధర పలికింది అంటే మొన్నటితో పోలిస్తే మూడు రెట్లు ఉల్లి ధర పెరిగింది దీంతో సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు ఉల్లి మహారాష్ట్ర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు చేరుకుంటుంది హైదరాబాదులోని మలక్పేట ఉల్లి మార్కెట్లోకి ఉల్లి ధర రాగా వివిధ ప్రాంతాలకు మార్కెట్లకు లోడ్ల ద్వారా కూలిన తరలిస్తారు దీంతో ఉల్లి ధర పెరగడంతో మార్కెట్ యజమానులు సంతోషపడగా సామాన్యులు మాత్రం ఉల్లి కన్నీరు పెట్టేస్తోంది అని అంటున్నారు…

ఉల్లి లేనిది ఏ కూర ఉండదు అలాంటి ఉల్లి ఇప్పుడు సామాన్యుల కు కన్నీరు పెట్టిస్తోంది… అటు వినియోగదారులకు ఇటు కన్జ్యూమర్లకు ఉల్లి కొనాలి అన్న వాడాలి అన్న కష్టతరంగా మారింది…ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై కేంద్రం సుంకం విధించినట్లు తెలిసిందే.. ఇప్పటికే టమాటా ధర విపరీతంగా పెరగడంతో దాని నుండి కోల్పోలేనటువంటి సామాన్య ప్రజలు ఇప్పుడు రోజువారిలో ఉపయోగించేటటువంటి ఉల్లి ధర పెరగడంతో అయోమయంలో పడ్డారు అందులోనూ ఇప్పుడు శుభకార్యాలకు ఎక్కువ జరిగేటటువంటి నెలలు కావడంతో ఏ వంట లో అయినా ఉల్లి తప్పనిసరి ఇప్పటికే ఆకాశం వైపు చూస్తున్నటువంటి ఉల్లి కేజీల కొద్దీ కొనాలి అంటే ముందు వెనక ఆలోచన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకవైపు పూల ధరలు మరొకవైపు బంగారం ధరలు ఇప్పుడు నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు మాత్రం ఏదీ  కొనలేని పరిస్థితి నెలకొంది.  ఇప్పటికే కిలో ఉల్లి ధర 42 రూపాయలు ఉండగా అది కాస్త 50 రూపాయలకు పైగా ఉల్లి ధర పలికే అవకాశం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles