51 ఏళ్ల వ్యక్తి వీల్ చైర్‌లో రూ. 12 కోట్ల విలువైన 11 కిలోల కొకైన్ లభ్యం!..ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల కళ్లు బైర్లు..

అక్కడ 2021లో 906 కేసులు, 2022లో 931 మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి గతేడాది ఏకంగా 178 మందిని అరెస్టు చేశారు. గత నవంబర్‌లో కూడా ఇదే తరహాలో న్యూయార్క్ విమానాశ్రయం ద్వారా వీల్‌చైర్‌లో అక్రమంగా తరలిస్తున్న..

51 ఏళ్ల వ్యక్తి వీల్ చైర్‌లో రూ. 12 కోట్ల విలువైన 11 కిలోల కొకైన్ లభ్యం!..ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల కళ్లు బైర్లు..
Motorised Wheelchair
Follow us

|

Updated on: Oct 18, 2023 | 7:14 AM

అనుమానిత ఎలక్ట్రిక్ వీల్‌చైర్‌ను తనిఖీ చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీల్ చైర్ కుషన్ సీటు కింద దాచిన 11 కిలోల కొకైన్ ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు 12,48,60,000 రూపాయలు (అక్షరాల15 లక్షల డాలర్లు) ఉంటుందని హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. కస్టమ్స్ క్లియరెన్స్ సమయంలో 51 ఏళ్ల ప్రయాణీకుడి ఎలక్ట్రిక్ వీల్ చైర్ పై అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

గత శనివారం కరీబియన్ దేశం సెయింట్ మార్టెన్ నుండి పారిస్ మీదుగా హాంకాంగ్ వచ్చిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నివేదికల ప్రకారం, నేరం రుజువైతే, అతనికి జీవిత ఖైదు విధించబడుతుంది. అతను తెచ్చిన రెండు వస్తువులలో ఒకటి వీల్ చైర్ ఉంది. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వీల్ చైర్ ను పరిశీలించగా దాని కుషన్, బ్యాక్ రెస్ట్ కొత్తగా కుట్టినట్లు గుర్తించారు. దాంతో అనుమానం వచ్చిన అధికారులు…తనిఖీ చేయగా కుషన్‌లో కొకైన్‌ దొరికింది.

అయితే, పట్టుబడిన వ్యక్తి హాంకాంగ్‌కు చెందినవాడు కాదు. వికలాంగుడైన స్నేహితుడు తనకు వీల్ చైర్ బహుమతిగా ఇచ్చాడని, తాను ఓ కారు అద్దె కంపెనీకి డైరెక్టర్ అని కస్టమ్స్ అధికారులకు చెప్పాడు. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘హై రిస్క్’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తనిఖీలు ముమ్మరం చేస్తామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

హాంకాంగ్‌లో 2021లో 906 కేసులు, 2022లో 931 మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి గతేడాది ఏకంగా 178 మందిని అరెస్టు చేశారు. గత నవంబర్‌లో కూడా ఇదే తరహాలో న్యూయార్క్ విమానాశ్రయం ద్వారా వీల్‌చైర్‌లో అక్రమంగా తరలిస్తున్న మహిళ నుంచి మూడున్నర కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఇటలీలో ఇదే తరహాలో వీల్‌చైర్‌తో కొకైన్ స్మగ్లర్ పట్టుబడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..