Congress Manifesto: అమ్మాయికి పెళ్లి కానుక.. 10గ్రాముల బంగారం, లక్ష నగదు ఇచ్చే యోచనలో టీ కాంగ్రెస్!
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్ 18న తెలంగాణలో పర్యటించి వివిధ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అక్టోబరు 18న ములుగులోని రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బస్సుయాత్రలో పాల్గొంటారు. ఆ తరువాత మహిళా సదస్సులో ప్రసంగిస్తారని సమాచారం. ఆ తర్వాత..
తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS తన మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఒక హామీని చేర్చాలని ఆలోచిస్తోంది. ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ స్కీమ్‌పేరుతో అర్హత ఉన్న మహిళలకు వారి వివాహ సమయంలో 10 గ్రాముల బంగారాన్ని అందించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా పార్టీ శ్రేణుల సమాచారం. ఈ ప్రతిపాదనకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని, ‘మహాలక్ష్మి’ హామీ ద్వారా వధువు కుటుంబానికి రూ.లక్ష అందించాలనే సంకల్పంతో పాటు, తులం బంగారం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ పేర్కొంది.
అయితే, ఈ సిఫార్సు ఇంకా ఫైనల్ కాలేదని, దీని నిర్ధారణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి), అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి)పై ఆధారపడి ఉంటుందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌టిఆర్‌సి) లో మహిళలకు నెలకు రూ. 2,500, ఎల్‌పిజి సిలిండర్ రూ. 500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్యారెంటీ ఇచ్చే ‘మహాలక్ష్మి’ పథకాన్ని కాంగ్రెస్ గతంలో ప్రవేశపెట్టింది. ‘మహాలక్ష్మి’ హామీ పథకం ప్రకటనతో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మహాకూటమి ప్రయత్నిస్తోంది.
Telangana: In Congress’s Telangana manifesto, the discussion is going on among the senior leaders that, in addition to the Rs 1 lakh of financial assistance given to the bride family under the Pasupu Kumkuma scheme, we would give 1 Tula Gold. This is the recommendation given by…
— ANI (@ANI) October 16, 2023
ఈ వారం తెలంగాణలో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్ 18న తెలంగాణలో పర్యటించి వివిధ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అక్టోబరు 18న ములుగులోని రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బస్సుయాత్రలో పాల్గొంటారు. ఆ తరువాత మహిళా సదస్సులో ప్రసంగిస్తారు, ఆ తర్వాత ప్రియాంక ఢిల్లీకి తిరిగి వెళ్తారు. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారని సమాచారం.
సింగరేణి కాలరీస్ కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం అక్టోబర్ 19న పెద్దపల్లి, కరీంనగర్‌లో ర్యాలీల్లో పాల్గొంటారు. అక్టోబర్ 20న జగిత్యాలలో రైతులతో రాహుల్ గాంధీ, నిజామాబాద్, ఆర్మూర్‌లలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Congress releases a list of 55 candidates for the upcoming Telangana Assembly polls
Telangana Congress president Revanth Reddy to contest from Kodangal pic.twitter.com/pEZCXboCxx
— ANI (@ANI) October 15, 2023
డేటా ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333, ఇందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళా ఓటర్లు, మిగిలిన ఓటర్లు థర్డ్ జెండర్‌కు చెందినవారు. ప్రస్తుతం, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) ప్రభుత్వం ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని అందిస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం, కళ్యాణలక్ష్మి పథకం ప్రధాన లక్ష్యం ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ కుటుంబాలకు చెందిన నూతన వివాహితలకు ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకం కింద పెళ్లి సమయంలో వధువు ఆర్థిక సహాయం తల్లి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది.
తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడబోతుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..