Hyderabad : కూకట్‌పల్లిలో సెలూన్ యజమాని దారుణ హత్య.. షాపులోనే కిరాతకంగా చంపేసిన దుండగులు

సెలూన్ షట్టర్ తెరిచి చూడగా అశోక్ కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు అశోక్‌ కార్మికుడు పంకజ్‌పై అనుమానంతో ఫిర్యాదు చేశారు.

Hyderabad : కూకట్‌పల్లిలో సెలూన్ యజమాని దారుణ హత్య..  షాపులోనే కిరాతకంగా చంపేసిన దుండగులు
Salon Owner Ashok
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 17, 2023 | 12:26 PM

హైదరాబాద్‌లో సెలూన్‌ యజమాని దారుణ హత్య కలకలం రేపింది. నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో సెలూన్ నిర్వహిస్తున్న వ్యక్తి (42)ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేసినట్టుగా పోలీసులు తెలిపారు. మృతుడు అశోక్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో సెలూన్‌ నిర్వహిస్తున్నాడు అశోక్. అయితే, గతంలో అశోక్‌ సెలూన్‌లో పనిచేసి మానేసిన పంకజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌ షాపుకు వచ్చే కస్టమర్లను పంకజ్‌తన సొంత సెలూన్‌కి మళ్లించుకున్నాడనే ఆరోపణతో అశోక్ అతనిని పనిలోంచి తొలగించాడని తెలిసింది. నాలుగు నెలల క్రితమే పంకజ్‌ని ఉద్యోగంలోకి తీసుకున్నాడని తెలిసింది.

ఇదిలా ఉండగానే. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత సెలూన్‌ షట్టర్‌ మూసివేసిన అశోక్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య, కొడుకు సెలూన్‌కు వచ్చి చూశారు.. అక్కడ అశోక్‌ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భయపడిపోయామంటూ అశోక్‌ భార్య నీరజా కంప్లైట్‌ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. దుండగుడు అశోక్‌ను పలుమార్లు కత్తితో పొడిచి షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

అశోక్ భార్య నీరజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన భర్త సెలూన్‌కి వెళ్లాడని, తమ సెలూన్‌ ఇంటికి ఆనుకునే ఉంటుందని చెప్పింది. రాత్రి 10 గంటల తర్వాత కూడా సెలూన్‌ మూసి ఉండడం గమనించాం.. కానీ, తన భర్త తిరిగి రాలేదని.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది.. అతనిని పిలవడానికి ప్రయత్నించినప్పుడు సమాధానం లేదు. దాంతో అశోక్‌ భార్య, కొడుకు సెలూన్‌ లోపలికి వెళ్లామని, సెలూన్ షట్టర్ తెరిచి చూడగా అశోక్ కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు అశోక్‌ కార్మికుడు పంకజ్‌పై అనుమానంతో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పంకజ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎం. సురేందర్‌ మాట్లాడుతూ పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ