Asaduddin Owaisi: దేశ విభజన చారిత్రక తప్పిదం.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
దేశ విభజన ఒక చారిత్రక తప్పిదమని, దీనిపై తాను ఒక్క లైన్‌లో సమాధానం చెప్పలేనని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ చారిత్రక తప్పిదానికి దేశ విభజన సమయం నాటి నాయకులే కారకులని ఆరోపించారు. తాను చేస్తున్న కామెంట్స్ పై క్లారిటీ రావాలంటే.. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. ‘‘దేశాన్ని విభజించవద్దని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పటి కాంగ్రెస్ నేతలను కలిసి వేడుకున్నారని..

దేశ విభజనపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని విభజించి ఉండాల్సింది కాదని అన్నారు. ఇది చారిత్రక తప్పిదమని ఎంపీ పేర్కొన్నారు. చారిత్రాత్మకంగా ఇది ఒక దేశం.. దురదృష్టవశాత్తూ విభజనకు గురైందని, అలా జరిగి ఉండకుంటే బాగుండేదన్నారు ఒవైసీ. అయితే, దేశ విభజన మహ్మద్ అలీ జిన్నా వల్ల కాదని, హిందూ మహాసభ డిమాండ్ మేరకే భారత్, పాకిస్థాన్‌లు ఏర్పాటయ్యాయని ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఏఐఎంఐఎం చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు..
దేశ విభజన చారిత్రక తప్పిదమని, దీనికి తాను ఒక్క లైన్‌లో సమాధానం చెప్పలేనని ఒవైసీ అన్నారు. దేశ విభజన నాటి నాయకులే దీనికి బాధ్యత వహించాలని, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుస్తకాన్ని చదవాలని సూచించారు.
చారిత్రక తప్పిదానికి ఒక్క లైన్‌లో సమాధానం చెప్పలేను – అసదుద్దీన్ ఒవైసీ
మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఒక్కటే చెప్పగలను.. కావాలంటే.. దీనిపై చర్చ నిర్వహించి.. దేశ విభజనకు అసలు బాధ్యులు ఎవరో చెబుతాను. ఆ సమయంలో “ఒక్క లైన్‌లో పొరపాటున స్పందించలేను.” స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ పుస్తకాన్ని చదవాలని, తాను కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి విభజన ప్రతిపాదనను అంగీకరించవద్దని ఎలా అభ్యర్థించానో చెప్పాలని సూచించినట్లుగా ఆ పుస్తకంలో ఆయన చెప్పారని ఒవైసీ గుర్తు చేశారు.
ఈ దేశాన్ని విభజించి ఉండాల్సింది కాదు.. విభజన తప్పని.. ఆ సమయంలో అక్కడ ఉన్న నేతలంతా ఇందుకు బాధ్యులని.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకాన్ని చదివితే.. కాంగ్రెస్ నేతలందరినీ మౌలానా ఆజాద్ అభ్యర్థన అర్థమవుతుందని ఒవైసీ అన్నారు.
వచ్చే నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అసదుద్దీన్ ఈ ప్రకటన కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో నవంబర్ 30న ఓటింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై కూడా ఒవైసీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..