Gas Cylinder: ప్రజలకు దీపావళి కానుక.. ఉచితంగా గ్యాస్ సిలిండర్.. వారికి మాత్రమే ఆఫర్!

గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మనమందరం కొత్త భారతదేశాన్ని చూశాం. ఈ కొత్త భారతదేశం సంపన్నమైనది. శక్తివంతమైనది. స్వావలంబనతో కూడుకున్నది అని చెప్పారు. 2014 తర్వాత దేశంలోని యువత, మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు, పౌరులకు కొత్త భారతదేశం ప్రయోజనం చేకూర్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు సైతం గ్యాస్ సిలిండర్ ధరను ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి.

Gas Cylinder: ప్రజలకు దీపావళి కానుక.. ఉచితంగా గ్యాస్ సిలిండర్.. వారికి మాత్రమే ఆఫర్!
Gas Cylinder
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 18, 2023 | 7:14 AM

ప్రతి సంవత్సరం పండుగల సీజన్‌కు ముందు ప్రభుత్వం ప్రజలకు ఏదో ఒక ప్రకటన చేస్తుంది. దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగల సందర్భంగా ప్రజలకు కొన్ని ప్రయోజనాలను ప్రకటించడం ద్వారా పండుగలను మరింత గొప్పగా, ఉత్సాహంగా జరుపుకునేలా చూస్తాయి ఆయా ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి కానుకగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఒక వంటగ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక ఉచిత LPG సిలిండర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి బహుమతిగా ఇచ్చారని, సిలిండర్ ధరలను రూ. 300 తగ్గించారని, ఈ పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లపై సబ్సిడీని పెంచుతూ కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు దీపావళి బొనాంజా ప్రకటించారు.

ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్‌ను అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 1.75 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. బులంద్‌షహర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 632 కోట్ల రూపాయలతో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అక్కడ రాష్ట్ర బిజెపి చీఫ్ భూపేంద్ర చౌదరి, కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్, యుపి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసిమ్ అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లు పొందడం చాలా కష్టమైన పని అని ఆదిత్యనాథ్ అన్నారు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అనేది బిపిఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకు ఎల్‌పిజి కనెక్షన్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ చొరవ తీసుకుందన్నారు. ఇతర బిజెపి పథకాలను హైలైట్ చేస్తూ, పిఎం ఆవాస్ యోజన కింద యుపిలో 55 లక్షల మంది మహిళలు ఇంటి యజమానులుగా మారారని, ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కింద రాష్ట్రంలో 2.75 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇవి కూడా చదవండి

గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మనమందరం కొత్త భారతదేశాన్ని చూశాం. ఈ కొత్త భారతదేశం సంపన్నమైనది. శక్తివంతమైనది. స్వావలంబనతో కూడుకున్నది అని చెప్పారు. 2014 తర్వాత దేశంలోని యువత, మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు, పౌరులకు కొత్త భారతదేశం ప్రయోజనం చేకూర్చిందని ఆదిత్యనాథ్ అన్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు సైతం గ్యాస్ సిలిండర్ ధరను ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఇప్పటికే గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల మేనిఫేస్టోలో కూడా ఇదే అంశాన్ని చేర్చింది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తాము మరోసారి అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.400 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!