చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??

చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Oct 18, 2023 | 9:49 AM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత పాములు, జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ పెద్ద నాగుపాము ముంగిస బారినుంచి తప్పించుకుంటూ ఓ చిన్నారి నిద్రపోతున్న ఊయలపైకి ఎక్కిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తృటిలో ఎంత ప్రమాదం తప్పిందంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియోలో పంటపొలాల్లో నిర్మించిన ఓ ఇంటి ఆవరణలో పామును తరుముతూ వచ్చింది ఓ ముంగిస.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత పాములు, జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ పెద్ద నాగుపాము ముంగిస బారినుంచి తప్పించుకుంటూ ఓ చిన్నారి నిద్రపోతున్న ఊయలపైకి ఎక్కిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తృటిలో ఎంత ప్రమాదం తప్పిందంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియోలో పంటపొలాల్లో నిర్మించిన ఓ ఇంటి ఆవరణలో పామును తరుముతూ వచ్చింది ఓ ముంగిస. ఆ ముంగిస భారినుంచి తప్పించుకుంటూ ఆ ఇంటి అరుగుపైకి ఎక్కేసింది పాము. అయినా ముంగిన పామును వదల్లేదు. అక్కడే ఊయలలో చిన్నారి నిద్రపోతోంది. ప్రాణ భయంతో నాగుపాము ఆ ఊయలపైకి ఎక్కేసింది. అది గమనించిన ఆ ఇంటివారు భయంతో కేకలు వేశారు. చుట్టుపక్కలవారంతా అక్కడికి చేరారు. చిన్నారి ఊయలపై ఉన్న పామును చూసి చాలా భయపడ్డారు. పామును తరిమేందుకు దొరికిన వస్తువుతో పెద్ద పెద్ద శబ్ధాలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఆఫీసర్‌ మహా స్ట్రిక్ట్‌.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..

లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్‌ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు

ఆ పొలంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్న జంతువులు.. ఎందుకంటే ??

సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

శ్రీశైలం గోపురంపై నాగుపాము.. అంతా శివుని మహిమ అంటున్న భక్తులు

 

Published on: Oct 18, 2023 09:48 AM