ఈ ఆఫీసర్‌ మహా స్ట్రిక్ట్‌.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..

ఈ ఆఫీసర్‌ మహా స్ట్రిక్ట్‌.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..

Phani CH

|

Updated on: Oct 18, 2023 | 9:49 AM

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందడమంటే అంత ఈజీ కాదు. అలాంటిది తహశీల్దారు ఉద్యోగం అంటే మాటలా.. ఏళ్లకు ఏళ్లు కష్టపడితేగానీ అది దక్కదు. గ్రూప్‌ 2 క్లియర్‌ చేస్తేనే తహసీల్దార్‌ స్థాయి ఉద్యోగం సొంతం అవుతుంది. కానీ మనుషులకు దక్కని యోగం ఓ కోతి ఎంతో సునాయాసంగా దక్కించుకుంది. దర్జాగా ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి.. అధికారుల కుర్చీలో కూర్చుంది. సీరియస్‌గా అక్కడున్న ఫైల్స్‌ అన్నీ తిరగేసి తెగ చెక్‌ చేసేసింది దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందడమంటే అంత ఈజీ కాదు. అలాంటిది తహశీల్దారు ఉద్యోగం అంటే మాటలా.. ఏళ్లకు ఏళ్లు కష్టపడితేగానీ అది దక్కదు. గ్రూప్‌ 2 క్లియర్‌ చేస్తేనే తహసీల్దార్‌ స్థాయి ఉద్యోగం సొంతం అవుతుంది. కానీ మనుషులకు దక్కని యోగం ఓ కోతి ఎంతో సునాయాసంగా దక్కించుకుంది. దర్జాగా ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి.. అధికారుల కుర్చీలో కూర్చుంది. సీరియస్‌గా అక్కడున్న ఫైల్స్‌ అన్నీ తిరగేసి తెగ చెక్‌ చేసేసింది దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఈ ఆఫీసర్‌ మహా స్ట్రిక్ట్‌ సుమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. యూపీలోని సహరాన్‌పూర్‌లోని బెహత్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ కోతి అక్కడి టేబుల్‌ ముందు ఉన్న కుర్చీలో కూర్చుని యమ సీరియెస్‌గా ఫైళ్లను తనిఖీ చెక్‌చేసింది. ఆ సమయంలో సర్‌ ఫైళ్లు చూసి చూసి అలిసిపోయారు ఫలహారం తీసుకోండి అన్నట్టుగా అక్కడి స్టాఫ్‌ ఒకరు దానికి అరటి పండు తినమని అక్కడ పెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్‌ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు

ఆ పొలంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్న జంతువులు.. ఎందుకంటే ??

సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

శ్రీశైలం గోపురంపై నాగుపాము.. అంతా శివుని మహిమ అంటున్న భక్తులు

Araku: అరకులో కాశ్మీర్‌ అందాలు.. చూడటానికి రెండు కళ్ళు చాలవుగా

Published on: Oct 18, 2023 09:46 AM