లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్‌ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు

లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్‌ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు

Phani CH

|

Updated on: Oct 18, 2023 | 9:45 AM

కొందరికి వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే. ఇష్టానికి వయసుతో పనిలేదని వారి చేష్టలతో రుజువుచేస్తుంటారు. ఈ వయసులోనే అలాంటి పనులు చేయాలనే నిబంధనలు వీరికి వర్తించవు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటూ యువకులకే సవాలు విసురుతుంటారు కొందరు వృద్ధులు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ 85 ఏళ్ల వృద్ధుడు లుంగీ ధరించి జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నాడు.

కొందరికి వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే. ఇష్టానికి వయసుతో పనిలేదని వారి చేష్టలతో రుజువుచేస్తుంటారు. ఈ వయసులోనే అలాంటి పనులు చేయాలనే నిబంధనలు వీరికి వర్తించవు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటూ యువకులకే సవాలు విసురుతుంటారు కొందరు వృద్ధులు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ 85 ఏళ్ల వృద్ధుడు లుంగీ ధరించి జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా అన్నిరకాల ఎక్సర్‌సైజులూ చేసాడు. అతని స్టైల్, లుక్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వయసులో అతనికి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన ఖాతాలో పోస్ట్‌ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. పది లక్షల మంది పైగా వీడియోను లైక్ చేశారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పొలంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్న జంతువులు.. ఎందుకంటే ??

సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

శ్రీశైలం గోపురంపై నాగుపాము.. అంతా శివుని మహిమ అంటున్న భక్తులు

Araku: అరకులో కాశ్మీర్‌ అందాలు.. చూడటానికి రెండు కళ్ళు చాలవుగా