శ్రీశైలం గోపురంపై నాగుపాము.. అంతా శివుని మహిమ అంటున్న భక్తులు

శ్రీశైలం గోపురంపై నాగుపాము.. అంతా శివుని మహిమ అంటున్న భక్తులు

Phani CH

|

Updated on: Oct 18, 2023 | 9:41 AM

శ్రీశైలం ఆలయ గోపురం‌పై నాగుపాము కలకలం రేపింది. దసరా మహోత్సవాల కోసం ఆలయానికి శివాజీ గోపురానికి లైటింగ్ వేస్తున్నారు. ఈ సమయంలో గోపురంపై సిబ్బందికి నాగు పాము కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో కిందకు దిగి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు దేవస్థానానికి చెందిన స్నేక్ క్యాచర్‌ కాళీ చరణ్‌కు సమాచారం ఇచ్చారు.

శ్రీశైలం ఆలయ గోపురం‌పై నాగుపాము కలకలం రేపింది. దసరా మహోత్సవాల కోసం ఆలయానికి శివాజీ గోపురానికి లైటింగ్ వేస్తున్నారు. ఈ సమయంలో గోపురంపై సిబ్బందికి నాగు పాము కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో కిందకు దిగి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు దేవస్థానానికి చెందిన స్నేక్ క్యాచర్‌ కాళీ చరణ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కాళీచరణ్‌ శివాజీ గోపురం పైకెక్కి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సురక్షితంగా ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయిన రోజే శివాజీ గోపురంపై నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అదంతా పరమేశ్వరుడి మహిమే అంటూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Araku: అరకులో కాశ్మీర్‌ అందాలు.. చూడటానికి రెండు కళ్ళు చాలవుగా