Viral Video: మెట్రోలో మరో వైరల్ వీడియో.. ఈ సారి యువకులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..! ఇంతకీ ఏం చేశారంటే..
ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఈ వీడియో చాలా అద్భుతంగా ఉందన్నారు. మరొకరు ఇలా వ్రాశారు - ఢిల్లీ మెట్రో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి అని.. ఇది అత్యంత అద్భుతమైన చర్యగా వీడియోను అభివర్ణించారు. వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రోకు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈసారి ఫైటింగ్, రొమాన్స్, డ్యాన్స్ కాకుండా ఓ మంచి పనిని చూడాల్సి వచ్చింది. అవును, నవరాత్రి రెండవ రోజు అంటే సోమవారం జరిగిన ఘటనకు సంబంధించి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఢిల్లీ మెట్రో వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇందులో కొందరు అబ్బాయిలు భజనలు పాడుతూ కనిపించారు.. అంతకుముందు సావన్ సందర్భంగా కవాడీలు మెట్రోలో డ్యాన్స్ చేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్లిప్ X లో (@AnchorAmandeep) పేరుతో పోస్ట్ చేశారు. ఇది క్యాప్షన్‌లో ఇది కూడా ఢిల్లీ మెట్రో వీడియో అని.. ఇది చూస్తే మీకు కోపం రాదు.. కానీ, సంతోషంగా ఉంటుందంటూ నెటిజన్లు వ్యాఖ్యనించారు.
అక్టోబర్ 16న పోస్ట్ చేసిన ఈ 38 సెకన్ల వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇందులో, నలుగురు అబ్బాయిల బృందం అమ్మవారి పాటలతో భజన చేస్తూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. రెండు సీట్లలో కూర్చున్న యువకులు..వారిలో ఒకరు గిటార్ వాయిస్తుండగా..మరో ఇద్దరు అబ్బాయిలు నిలబడి ‘తూనే ముఝే బులాయా షెరావాలి’ అనే భజన పాడుతున్నారు. ఈ సమయంలో కొందరు ప్రయాణికులు వీడియోలు తీస్తూ బిజీగా ఉన్నారు.
ये भी दिल्ली मेट्रो का वीडियो है, जिसे देखके आपको गुस्सा नहीं खुशी होने वाली है
जय माता दी 🙏 pic.twitter.com/qY8NUaqne6
— Anchor Amandeep Kaur (@AnchorAmandeep) October 16, 2023
ఈ వీడియోను చూసిన ఒక వినియోగదారు ఇలా వ్రాశారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఈ వీడియో చాలా అద్భుతంగా ఉందన్నారు. మరొకరు ఇలా వ్రాశారు – ఢిల్లీ మెట్రో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి అని.. ఇది అత్యంత అద్భుతమైన చర్యగా వీడియోను అభివర్ణించారు. వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..