Foxglove: అందమైన ఈ పువ్వులతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ! ఈ పూల మొక్క మీ ఇంట్లో ఉందేమో చూసుకోండి..

కేవలం ఈ పువ్వు వాసన చూడడం మాత్రమే కాదు.. తాకడం కూడా ప్రాణాపాయం కలిగిస్తుంది. ఫాక్స్ గ్లోవ్ ప్రధానంగా గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇందులోని  కారకాలు కొన్ని గుండెకు హానికరం. నెమ్మదిగా ఇది గుండె చప్పుడులో మార్పును కలిగిస్తుంది. అప్పుడు గుండెపోటు వరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది.

Foxglove: అందమైన ఈ పువ్వులతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ! ఈ పూల మొక్క మీ ఇంట్లో ఉందేమో చూసుకోండి..
Foxglove
Follow us

|

Updated on: Oct 18, 2023 | 12:28 PM

గుండెపోటు అనేది ఎవరికైనా భయం కలిగించే పరిస్థితి. ప్రాణాపాయ స్థితి. అనేక కారణాలు గుండెపోటుకు దారితీస్తాయి. ఊబకాయం, కొలెస్ట్రాల్, బీపీ లేదా మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు, గుండె జబ్బులు అనేక ఇతర కారణాలు మనిషిని గుండెపోటుకు దారితీస్తాయి. కానీ ఒక పువ్వు గుండెపోటుకు కారణమవుతుందంటే మీరు నమ్మగలరా? అవును..? ఇప్పుడు పరిశోధకులు చెబుతున్న మాటలను బట్టి ఇది నిజమేనా అనే అనుమానం కలుగుతోంది.’ఫాక్స్‌గ్లోవ్’ అని పిలువబడే ఒక అందమైన పువ్వు గుండెపోటుకు కారణంగా మారుతుంది. దీని శాస్త్రీయ నామం ‘డిజిటాలిస్’. ఇది పింక్-పర్పుల్ పువ్వులా కనిపిస్తుంది. అయితే ఇందులో ఒకే కాండం మీద చాలా పువ్వులు పూస్తాయి. వీటి అందం అందరినీ ఆకర్షిస్తుంది. ఇది సాధారణంగా యూరప్, ఆసియా అంతటా కనిపిస్తుంది.

కానీ మానవ నివాసా ప్రదేశాలలో ‘ఫాక్స్‌గ్లోవ్‌ పూలు కనపించవు. ఎందుకంటే..కేవలం ఈ పువ్వు వాసన చూడడం మాత్రమే కాదు.. తాకడం కూడా ప్రాణాపాయం కలిగిస్తుంది. ఫాక్స్ గ్లోవ్ ప్రధానంగా గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇందులోని  కారకాలు కొన్ని గుండెకు హానికరం. నెమ్మదిగా ఇది గుండె చప్పుడులో మార్పును కలిగిస్తుంది. అప్పుడు గుండెపోటు వరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది.

అయితే అందరికీ ఒకే రకమైన సమస్య తీవ్రత ఉండదు. అనేక మోతాదులు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇది కొందరిలో మరణానికి కూడా దారి తీస్తుంది. లక్షణాలు వికారం, అస్పష్టమైన దృష్టి, నెమ్మదిగా పల్స్, వాంతులు, మైకము, అధిక మూత్రవిసర్జన, బలహీనత, కండరాల బలహీనత, వణుకు, గందరగోళంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏది ఏమైనా పువ్వును వాసన చూసినా, ముట్టుకున్నా ప్రాణాపాయం తప్పదన్నది నిజం. లక్షణాలు తక్కువగా ఉన్నాయా లేదా అని వేచి చూడకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం అవసరం.

చాలా చోట్ల ‘ఫాక్స్‌గ్లోవ్’ పువ్వు అందాన్ని చూసి ఆసుపత్రుల్లో చేరిన ఘటనలే ఎక్కువగా కనిపించాయి. ఇలాంటి పువ్వును గుండెకు సంబంధించిన అనేక సమస్యల్లో మందులను తయారు చేయడానికి ఈ పువ్వు నుండి కొన్ని భాగాలు వినియోగిస్తారు.. ఏది ఏమైనా ఈ ప్రాణాంతక హంతక పుష్పం గురించి చాలా మందికి తెలియదన్నది నిజం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles