Horoscope Today: వారి ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (అక్టోబర్ 18, 2023): మేష రాశి వారికి రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మిథున రాశి వారికి ముఖ్యమైన ప్రయత్నాలు, నిర్ణయాలు తప్పకుండా సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దిన ఫలాలు (అక్టోబర్ 18, 2023): మేష రాశి వారికి రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మిథున రాశి వారికి ముఖ్యమైన ప్రయత్నాలు, నిర్ణయాలు తప్పకుండా సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనుల్ని కూడా పట్టు దలగా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఈ రోజు బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రుల నుంచి అనుకూలతలుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం మెరుగుపడు తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయంలో బాగా పెరుగుదల ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఏ ప్రయత్నానికైనా ఈ రోజు చాలా బాగుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. సతీమణికి సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లలు, బంధువుల నుంచి శుభవార్తలు అందు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
శుభ గ్రహాలు చాలావరకు అనుకూలంగా మారాయి. ఫలితంగా, ముఖ్యమైన ప్రయత్నాలు, నిర్ణయాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. సతీమణికి ఉద్యోగపరంగా మంచి అభి వృద్ధి ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అప్పుడప్పుడూ అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఒత్తిడి ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగానూ, ఫలితం తక్కువగానూ ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, దుబారాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. హద్దులు దాటిన ఔదార్యంతో మిత్రులకు సాయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రస్తుతం భాగ్య స్థానం బలంగా ఉన్నందువల్ల ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమైపోతాయి. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు ఎదురుండదు. వ్యాపారాలు అను కూలంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సతీమణి ఉద్యోగపరంగా రాణిస్తారు. బంధు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కొద్దిగా తిప్పట తప్పక పోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అవనసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సతీ మణికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సతీమణికి అనుకో కుండా అదృష్టం పడుతుంది. విలాస జీవితం మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా చికాకులుంటాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండ డం మంచిది. మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాస లతో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. కీలక నిర్ణయాల్లో సతీమణిని సంప్రదించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమయం అన్నివిధాలుగానూ అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రయ త్నాలు, నిర్ణయాలు, ఆలోచనలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుం డదు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో పనిభారం, బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం అనుకూలి స్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడ తారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల వాతావరణం ఉత్సాహంగా, అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. దాంపత్య జీవి తం అన్యోన్యంగా సాగి పోతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మీ ఆలోచనలు, సలహాలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపా రాల తీరును మార్చే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సతీమణికి ఉద్యో గంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.