Chandrababu Naidu: హైకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. విచారణ నవంబర్ 7కు వాయిదా
చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను మరోసారి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు(ఏఆర్ఆర్) కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు.. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో.. కోర్టులలో పిటిషన్ల ఫైట్ కొనసాగుతునే ఉంది. పలు కేసుల్లో.. ఏసీబీ కోర్ట్ నుంచి... సుప్రీం కోర్ట్ వరకు వాదనలు - వాయిదాల పర్వం కొనసాగుతోంది..
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను మరోసారి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు(ఏఆర్ఆర్) కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు.. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో.. కోర్టులలో పిటిషన్ల ఫైట్ కొనసాగుతునే ఉంది. పలు కేసుల్లో.. ఏసీబీ కోర్ట్ నుంచి… సుప్రీం కోర్ట్ వరకు వాదనలు – వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో… టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. అటు.. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలావుంటే.. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతోపాటు పీటీ వారెంట్‌పై కూడా స్టే ఇవ్వాలంటూ పెట్టుకున్న కేసును కూడా వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ మంత్రి నారాయణ కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణను నవంబరు 7వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకూ ఈ కేసులో బెయిల్ కోసం ఆగాల్సిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు 40రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. కుటుంబసభ్యులు సైతం పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబును జైలులోనే చంపేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి