ఓరి దేవుడో! యమ్మీ యమ్మీ అనుకుంటూ లాగించే నూడుల్స్‌.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే.. ఇక అంతే..

స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కోసం నూడుల్స్ తయారు చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో నూడుల్స్ తయారు చేస్తున్న విధానాన్ని చూపించింది. ఇలా చాలా సెంటర్లు పనిచేస్తున్నాయని వీడియో చూసిన పలువురు కామెంట్ల ద్వారా చెబుతున్నారు. ఇలాంటి ఆహారం తిన్న తర్వాత ప్రజల పరిస్థితి ఎంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఓరి దేవుడో! యమ్మీ యమ్మీ అనుకుంటూ లాగించే నూడుల్స్‌.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే.. ఇక అంతే..
Noodles Making
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 18, 2023 | 1:39 PM

సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ మనం అనేక రకాలైన వైరల్‌ వీడియోలను చూస్తుంటాం..ఈ వీడియోలలో చాలా వరకు ఫుడ్ వీడియోలు కూడా ఉంటాయి. ఆహార తయారీ, తినే విధానానికి సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్‌నెట్‌లో కనిపిస్తాయి. కానీ కొన్ని ఫుడ్ వీడియోలను చూడటం వల్ల మనలో ఉత్సుకత, తినాలనే కోరిక రెండు చచ్చిపోతాయి. పైగా అలాంటి వీడియోలను చూస్తే.. అసహ్యం, భయం లేదా ఆందోళన కలుగుతుంది. ఈ రకమైన వీడియోల కంటెంట్ అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేయటం, నిర్లక్ష్యం వహించటం వంటి చర్యలు నెటిజన్లను మరింత ఆందోళనలో పడేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కోసం నూడుల్స్ తయారు చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియోలో నూడుల్స్ తయారీ కోసం పిండిని మెత్తగా పిసి సిద్ధం చేయటం మొదలు నూడుల్స్‌ని ఆవిరిలో ఉడికించి చివరకు ప్యాక్ చేసే విధానాన్ని వీడియోలో వివరంగా చూపించారు. కానీ, ఎక్కడ శుభ్రత ప్రమాణాలు పాటించిన దాఖలాలు కనిపించలేదు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. పిండి తడపటం కూడా అక్కడి సిబ్బంది కాళ్లతో తొక్కుతూ తన్నుతూ తిరుగుతున్నారు. అలా తయారు చేసిన నూడుల్స్‌ను వాళ్లు నడుస్తున్న నేలపైనే కుప్పలుగా పోశారు. అలా ఒక్కచోట అని కాదు.. మొదటి నుండి చివర వరకు ప్రతిసారీ, ప్రతిచోటా అపరిశుభ్రత మాత్రమే కనిపించింది. ఏది ఏమైనా ఆ వీడియో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియో కోల్‌కత్తాకు చెందినదిగా తెలిసింది. ఇది పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో నూడుల్స్ తయారు చేస్తున్న విధానాన్ని చూపించింది. ఇలా చాలా సెంటర్లు పనిచేస్తున్నాయని వీడియో చూసిన పలువురు కామెంట్ల ద్వారా చెబుతున్నారు. ఇలాంటి ఆహారం తిన్న తర్వాత ప్రజల పరిస్థితి ఎంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..