The Nun II OTT: దడ పుట్టించే దెయ్యం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ‘ది నన్‌2’ తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఈ ఫేమస్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన మరో సూపర్‌ హార్రర్‌ ఫిల్మ్‌ ది నన్‌. 2018లో థియేటర్లలో సైలెంట్‌గా వచ్చిన ఈ హాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెట్టింది. అంతే కాదు వసూళ్ల పరంగా ఎన్నో సంచలనాలు సృష్టించింది. సుమారు ఐదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే ది నన్‌ 2. జేమ్స్‌ వాన్‌, పీటర్‌ సాఫ్రన్‌, జూడ్సన్‌ స్కాట్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మైఖేల్‌ చేవ్స్‌ దర్శకత్వం వహించారు.

The Nun II OTT: దడ పుట్టించే దెయ్యం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. 'ది నన్‌2' తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
The Nun II Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 17, 2023 | 7:24 PM

ఇప్పుడు అన్ని భాషల్లో హార్రర్‌ సినిమాలు వస్తున్నాయి. అయితే హాలీవుడ్‌ హార్రర్‌ సినిమాలకు ఉన్న క్రేజ్‌ మాత్రం నెక్ట్స్‌ లెవెల్‌. ముఖ్యంగా వార్నర్‌ బ్రదర్స్‌ ప్రొడక్షన్‌ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను భయపెట్టి భారీ వసూళ్లు దక్కించుకున్నాయి. ఈ బ్యానర్‌ నుంచి ది కంజూరింగ్‌, అన్నబెల్లె, ఈవిడ్‌ డెడ్‌, లైట్స్‌ అవుట్‌ వంటి హార్రర్‌ ఫ్రాంఛైజీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచాయి. అలా ఈ ఫేమస్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన మరో సూపర్‌ హార్రర్‌ ఫిల్మ్‌ ది నన్‌. 2018లో థియేటర్లలో సైలెంట్‌గా వచ్చిన ఈ హాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెట్టింది. అంతే కాదు వసూళ్ల పరంగా ఎన్నో సంచలనాలు సృష్టించింది. సుమారు ఐదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే ది నన్‌ 2. జేమ్స్‌ వాన్‌, పీటర్‌ సాఫ్రన్‌, జూడ్సన్‌ స్కాట్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మైఖేల్‌ చేవ్స్‌ దర్శకత్వం వహించారు. సిస్టర్‌ ఇరేనే పాత్రలో టైస్సా ఫార్మిగా నటించింది. సెప్టెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. జనాలను బాగానే భయపట్టింది. షారుక్‌ ఖాన్‌ జవాన్‌కు పోటీలో ఉన్నప్పటికీ ఇండియాలోనూ ఈ హార్రర్ ఫిల్మ్‌కు మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడీ దెయ్యం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో పాటు బుక్‌ మై షో లోనూ ది నన్‌ 2 మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ వెర్షన్లలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఒక దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది? అన్న ఇతివృత్తంతో నన్‌–2 తెరకెక్కించారు. కథ, కథనం, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని గతంలో వార్నర్‌ బ్రదర్స్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ది నన్‌ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌ బీజీఎమ్‌. కాగా ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రెంటల్‌ విధానంలోనే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తమ సబ్‌ స్క్రైబర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మరి థియేటర్లలో ది నన్‌ 2 సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆస్వాదించండి.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..