Maama Mascheendra OTT: ఇట్స్ అఫిషియల్.. ‘ఆహా’లో సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మామా మశ్చీంద్ర సినిమాలో సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరి తేజ, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లింగ్, ఎంగేజింగ్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్, పుష్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.
విలక్షణమైన ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోస్‌తో మెప్పిస్తోన్న ఆహా లిస్టులో మరో థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా ‘మామా మశ్చీంద్ర’ చేరింది. అక్టోబర్ 20 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరి తేజ, అజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లింగ్, ఎంగేజింగ్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ‘మామా మశ్చీంద్ర’ చిత్రాన్ని హర్షవర్ధన్ దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుష్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. పరశురాం (సుధీర్ బాబు) జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో ‘మామా మశ్చీంద్ర’ సినిమా రూపొందింది. తన తండ్రి, సవతి తల్లి కారణంగా కన్నతల్లి చనిపోవటంతో పరశురాం ప్రతీకారం తీర్చుకుంటాడు. జైలు జీవితం తర్వాత తన తల్లి పేరు మీదున్న ఆస్తి అంతా మేనమామ చేతుల్లో ఉందని తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మేనమామ నమ్మకాన్ని గెలుచుకుని ఆయన కూతురిని పెళ్లి చేసుకుంటాడు.
సినిమా కథను గమనిస్తే పరశురామ్ తన మేనమామ కొడుకు ప్రసాద్ (అజయ్) కుటుంబాన్ని అంతమొందించమని అతని సహాయకుడు రామదాసు (హర్షవర్ధన్)ని ఆదేశిస్తాడు. అయితే ప్రసాద్ ఇద్దరు కుమారులు దుర్గ, డీజే (ఆ పాత్రలను కూడా సుధీర్ బాబు పోషించారు)..పరశురామ్‌లా ఉంటారు. అక్కడి నుంచి విధి వారిని అనేక మలుపులు తిప్పుతుంది. ఇది ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందిస్తుంది. రివేంజ్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా అంశాలు కలగలిసిన ‘మామా మశ్చీంద్ర’ చిత్రం అక్టోబర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులకు మరచిపోలేని సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి ఈ సినిమాను ఆహాలో చూడటానికి అసలు మిస్ కాకండి.
అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్..
View this post on Instagram
బుర్ఖాలో వెళ్లి మామా మశ్చీంద్ర సినిమా చూసిన సుధీర్ బాబు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..