Chinna Movie OTT: ఓటీటీలోకి గుండెల్ని పిండేసే సినిమా.. సిద్ధార్థ్ ‘చిన్నా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఒకప్పుడు టాలీవుడ్‌లో హ్యాండ్‌సమ్ హీరోగా వరుస హిట్లు కొట్టాడు సిద్ధార్థ్. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో యూత్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత వరుస ప్లాఫ్‌లతో సతమతమయ్యాడు. ఈ కారణంగానే చాలా రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.
ఒకప్పుడు టాలీవుడ్‌లో హ్యాండ్‌సమ్ హీరోగా వరుస హిట్లు కొట్టాడు సిద్ధార్థ్. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో యూత్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత వరుస ప్లాఫ్‌లతో సతమతమయ్యాడు. ఈ కారణంగానే చాలా రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. మహాసముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా హిట్టు కొట్టలేకపోయాడు. టక్కర్ మూవీతో మాస్ హీరోగా అదృష్టం పరీక్షించుకున్నా సక్సెస్ మాత్రం రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ నటించిన చిత్తా (తెలుగులో చిన్నా) సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. సెప్టెంబర్ 28న రిలీజ్ తమిళంలో రిలీజైన ఈ మూవీకి కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. దీంతో అక్టోబర్ 6న చిన్నా పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఎమోషనల్ మూవీగా ఇక్కడ కూడా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో హీరో సిద్ధార్థ్‌నే స్వయంగా చిన్నా సినిమాను నిర్మించడం విశేషం. ఇందులో చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ వంటి సున్నితమైన అంశాలను ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ ఎ స్‍యూ అరుణ్ కుమార్. చిన్నా మూవీ లో సిద్ధార్థ్‌తో పాటు నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన చిన్నా మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్ధార్థ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అక్టోబర్ నెల ఆఖరి వారంలో చిన్నా మూవీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
చిన్నా సినిమా కథేంటంటే?..
హీరో సిద్ధార్థ్ నిర్మించిన చిన్నా సినిమాకు విశాల్ చంద్రశేఖర్, దిబు నినన్ థామస్, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. బాలాజీ సుబ్రమణ్యం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సురేష్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. చిన్నా సినిమా కథ విషయానికి వస్తే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో కలిసి ఓ జాబ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటాడు ఈశ్వర్ సిద్ధార్థ్. అయితే నగరంలో చిన్న పిల్లల్ని ఎత్తు కెళ్లి రేప్ చేయడం, చంపేయడం వంటి సంఘటనలు జరుగుతాయి. అదే సమయంలో ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తాయి. పోలీసులు కొట్టి అతనిని అరెస్ట్ చేస్తారు. ఇదే సమయంలో ఈశ్వర్ కూతురు కూడా మిస్ అవుతుంది. మరి ఈశ్వర్ తన అన్న కూతురును వెతికి పట్టుకున్నాడా? లేదా? అన్నది తెరమీద చూడాల్సిందే.
చిన్నా సినిమా ట్రైలర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.