Bigg Boss 7 Telugu: ‘నాగార్జున నోటికొచ్చింది మాట్లాడతారా? నా భర్త రివర్స్‌ అయితే కథ వేరే ఉంటది’ : సందీప్‌ భార్య

ఆట సందీప్‌.. డ్యాన్స్‌ రియాలిటీ షోలతో బాగా ఫేమస్ అయిన ఈ డ్యాన్స్‌ మాస్టర్‌ బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ టాప్‌ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నాడు. ఏడో సీజన్‌ హౌజ్‌ మేట్‌గా ఎంపికైన అతను ఐదు వారాల పాటు ఇమ్యూనిటీ సంపాదించాడు. అయితే తన మాటలు, చేతలతో ఎక్కడాలేని నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా సంచాలక్‌గా ఉన్న సందర్భాల్లో కొందరు కంటెస్టెంట్లకు ఫేవర్‌గా వ్యవహరించాడన్న అపవాదు కొని తెచ్చుకున్నాడు.

Bigg Boss 7 Telugu: 'నాగార్జున నోటికొచ్చింది మాట్లాడతారా? నా భర్త రివర్స్‌ అయితే కథ వేరే ఉంటది' : సందీప్‌ భార్య
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 15, 2023 | 6:01 PM

ఆట సందీప్‌.. డ్యాన్స్‌ రియాలిటీ షోలతో బాగా ఫేమస్ అయిన ఈ డ్యాన్స్‌ మాస్టర్‌ బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ టాప్‌ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నాడు. ఏడో సీజన్‌ హౌజ్‌ మేట్‌గా ఎంపికైన అతను ఐదు వారాల పాటు ఇమ్యూనిటీ సంపాదించాడు. అయితే తన మాటలు, చేతలతో ఎక్కడాలేని నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా సంచాలక్‌గా ఉన్న సందర్భాల్లో కొందరు కంటెస్టెంట్లకు ఫేవర్‌గా వ్యవహరించాడన్న అపవాదు కొని తెచ్చుకున్నాడు. ఇక తన చెత్త నిర్ణయాల కారణంగా నాగార్జునతోనూ చివాట్లు తిన్నాడు. ఒకానొక దశలో ‘ హౌజ్‌లో నువ్వు ఏమైనా పిస్తావా’ అంటూ నాగ్‌ సందీప్‌ను ఉతికారేశారు. అయితే ఆట సందీప్‌ని నాగార్జున అలా తిట్టడంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది సందీప్‌ సతీమణి జ్యోతి రాజ్‌. ఆయన కామ్‌గా ఉన్నారని అందరూ గెలుకుతున్నారు. ఒక వేళ ఆయన రివర్స్‌ అయితే ఎవరూ తట్టుకోలేరంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ప్రస్తుతం సందీప్‌ సతీమణి చేసిన కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘నాగార్జున గారు.. సందీప్‌ని అలా తిట్టడం నాకు నచ్చలేదు. ఆయనేంటి? అలా అంటున్నారేంటి? అని చాలా ఫీల్ అయ్యాను. నా భర్త నాకు గొప్ప. అక్కడ అన్నది నాగార్జున గారని కాదు.. ఒక భార్యగా నా భర్త నాకు గొప్ప. ఎంత పెద్ద గొప్పవాళ్లు ఉన్నా, ఏ స్టేటస్ లో ఉన్నా కూడా నా భర్తే నాకు గొప్ప. నాగార్జున గారికి అంత పెద్ద స్థాయి ఉంటే మాత్రం ఎంత మాట అయినా అనేస్తాడా?’

‘ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో నా భర్త నటిస్తున్నాడని అంటున్నారు. కోపాన్ని తగ్గించుకుని యాక్ట్‌ చేస్తున్నాడని, అలాగే ఒరిజినల్‌ సందీప్‌ కాదని అంటున్నారు. బిగ్ బాస్ అనేది డ్యాన్స్ రియాలిటీ షో కాదు. తన ప్రొఫెషనల్‌గా మాత్రమే అగ్రెసివ్‌ గా ఉంటాడు. మిగతా సమయాల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఇక బిగ్‌ బాస్‌ అనేది ఒక ఫ్యామిలీ రియాలిటీ షో. ఇంట్లో ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలాగే ఉంటాడు. బిగ్‌బాస్‌కు వెళ్లేటప్పుడే దీనిపై మా ఆయన, అత్తమ్మ, నేను ముగ్గురం చర్చించుకున్నాం. టైటిల్‌ గెలిచినా, గెలవకపోయినా.. ఆడియెన్స్‌ మనసులు గెలవాలని సందీప్‌తో చెప్పాం. ఈ కారణంగానే ఆయన హౌజ్‌లో ఎంతో కూల్‌గా ఉంటున్నారు. అయితే దీనినే అవకాశంగా తీసుకుని చాలామంది సందీప్ మాస్టర్‌ని కావాలనే కెలుకుతున్నారు. ఒకవేళ ఆయన తిరిగి ఇచ్చాడంటే ఎవ్వరూ నిలవలేరు. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ ఇచ్చి పడేస్తారు. అయితే ఇంతదాకా వెళ్లడం ఎందుకు అంటూ కేవలం బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులపైనే సందీప్‌ దృష్టి పెడుతున్నాడు. బెస్ట్‌ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాడు. బిగ్‌బాస్‌ తో మాకు ఒరిగిదేమి లేదు. ‘ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది జ్యోతి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

నా భర్తపై దుష్ప్రచారం చేస్తున్నారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!