Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లో భగవంత్‌ కేసరి టీమ్‌.. శ్రీలీల మాటలకు మెలికలు తిరిగిపోయిన అమర్‌.. వీడియో

బిగ్‌బాస్‌ హౌజ్‌లో సండే ఫండే వచ్చసింది. వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్‌లో మాత్రం హౌజ్‌లో మస్త్‌ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. హోస్ట్‌ నాగార్జునతో పాటు స్పెషల్‌ గెస్టులు వచ్చి షోను మరింత రక్తి కట్టిస్తారు. కంటెస్టెంట్స్‌తో గేమ్స్‌.. సరదా మాటలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్‌ చాలా సరదాగా గడిచిపోతుంది. అలా ఈ వారం భగవంత్‌ కేసరి టీమ్‌ బిగ్‌ బాస్‌ షోలో సందడి చేసింది. దర్శకుడు అనిల్‌ రావి పూడి, హీరోయిన్‌ శ్రీలీల బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి..

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లో భగవంత్‌ కేసరి టీమ్‌.. శ్రీలీల మాటలకు మెలికలు తిరిగిపోయిన అమర్‌.. వీడియో
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 15, 2023 | 3:23 PM

బిగ్‌బాస్‌ హౌజ్‌లో సండే ఫండే వచ్చసింది. వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్‌లో మాత్రం హౌజ్‌లో మస్త్‌ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. హోస్ట్‌ నాగార్జునతో పాటు స్పెషల్‌ గెస్టులు వచ్చి షోను మరింత రక్తి కట్టిస్తారు. కంటెస్టెంట్స్‌తో గేమ్స్‌.. సరదా మాటలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్‌ చాలా సరదాగా గడిచిపోతుంది. అలా ఈ వారం భగవంత్‌ కేసరి టీమ్‌ బిగ్‌ బాస్‌ షోలో సందడి చేసింది. దర్శకుడు అనిల్‌ రావి పూడి, హీరోయిన్‌ శ్రీలీల బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి చిలిపి వ్యాఖ్యలతో వినోదం అందించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మొదట బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నావా? టైముందా? ఉల్టా పుల్టా సీజన్ ఎలా ఉందని నాగార్జున డైరెక్టర్‌ అనిల్​ రావిపూడిని అడిగారు. ఈ సీజన్‌లో రెండు, మూడు ఎపిసోడ్లు మినహా అన్ని చూశానని, అన్నింటిలోనూ ఇదే బెస్ట్ సీజన్ అని అనిల్‌ తెలిపాడు. అలాగే నాగార్జున గ్లామర్‌ గురించి మాట్లాడుతూ.. ‘సీజన్ సీజన్​కి టీఆర్పీ పెరిగనట్టే మీ గ్లామర్ పెరుగుతుంది’ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత హౌజ్‌ మేట్స్‌ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. మొదట శివాజీకి అదిరిపోయే పంచ్‌ ఇచ్చాడు అనిల్‌. ‘వచ్చేటప్పుడు దారిలో నేను తిరగని కాఫీ షాప్‌ లేదు. పాపం మా అన్న శివాజీ ఫేస్‌ చూడండి’ అని తనదైన శైలిలో పంచులు వేశారు. ఆ తర్వాత టేస్టీ తేజా గురించి మాట్లాడుతూ కాలేజ్ లో తన జూనియర్ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్‌. వెంటనే తేజ లేచి అనిల్ తన సీనియర్ అని చెప్పడంతో నాగ్‌ గట్టిగానే కౌంటర్‌ వేశారు. అలాగే తేజ ఆట బాగా ఇంప్రూవ్‌ అయ్యిందని అనిల్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు.

ఇక శోభా శెట్టి ఒక క్రాకర్ అని హౌజ్‌లో అందరినీ ఒక ఆట ఆడిస్తుందని అనిల్‌ చెప్పుకొచ్చాడు. ఇంతలో అమర్‌ దీప్‌ లేచి ‘శ్రీలీల గారూ.. మీరు ఏం చెప్పలేదండి’ అని అడగడంతో ‘మీరు చాలా బాగున్నారండి’ అని ఆమె చెప్పింది. అయితే మనోడికి అర్థం కాలేదేమో..సింపుల్‌గా థ్యాంక్యూ అండి అని కూర్చున్నాడు. ఆ వెంటనే నాగార్జున కలగజేసుకొని.. ‘శ్రీలీల ఎం చెప్పిందో అర్థమయిందా? నువ్వు చాలా బాగున్నావని క్యూట్‌గా అనేసింది. దీంతో అమర్‌ సిగ్గుతో మొగ్గలేశాడు. తెగ మెలికలు తిరిగిపోయాడు. ఇక ప్రిన్స్‌ యావర్​కి గత ఎపిసోడ్స్​లో తెలుగు క్లాసులు తీసుకున్నారు. అది ఎంత వరకు పని చేసిందో అనిల్ రావిపూడి పరీక్ష పెట్టాడు . తెలుగులో ఏదైనా డైలాగ్ చెప్పమంటే నాగార్జున నటించిన ‘మాస్’ సినిమాలోని డైలాగ్‌ను గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. దీనికి నాగార్జున కూడా ఫిదా అయ్యారు. ఈ డైలాగులు ఎక్కడో విన్నట్లు ఉన్నాయే అని నాగ్‌ ఆలోచిస్తూ ఉండగా మాస్‌ సినిమా అని డైరెక్టర్‌ అనిల్‌ గుర్తు చేశాడు. అవును తన సినిమానే కదా అని నాగార్జున మరోసారి ఆశ్చర్యపోయాడు.

ఇవి కూడా చదవండి

బిగ్‌బాస్‌ లేటెస్ట్ ప్రోమో చూశారా?

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..