AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sulthan Of Delhi OTT: ఓటీటీలోకి వచ్చేసిన మెహరీన్‌ తొలి వెబ్‌ సిరీస్‌.. సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర‌ ప్రేమ‌గాథ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది మెహ‌రీన్‌. ఇందులో తన క్యూట్‌ యాక్టింగ్‌తో అందరినీ కట్టేపడేసిందీ పంజాబీ బ్యూటీ. ఆ తర్వాత మహానుభావుడు, కేరాఫ్‌ సూర్య, పంతం, జవాన్‌, నోటా, కవచం, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3, ఎంత మంచి వాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయ్‌ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే గతంలో వేగంగా సినిమాలు చేసిన మెహరీన్‌ ఈ మధ్యన సిల్వర్‌ స్క్రీన్‌పై ఎక్కువగా కనిపించడం లేదు

Sulthan Of Delhi OTT: ఓటీటీలోకి వచ్చేసిన మెహరీన్‌ తొలి వెబ్‌ సిరీస్‌.. సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Mehreen Pirzada
Basha Shek
|

Updated on: Oct 14, 2023 | 1:23 PM

Share

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర‌ ప్రేమ‌గాథ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది మెహ‌రీన్‌. ఇందులో తన క్యూట్‌ యాక్టింగ్‌తో అందరినీ కట్టేపడేసిందీ పంజాబీ బ్యూటీ. ఆ తర్వాత మహానుభావుడు, కేరాఫ్‌ సూర్య, పంతం, జవాన్‌, నోటా, కవచం, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3, ఎంత మంచి వాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయ్‌ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే గతంలో వేగంగా సినిమాలు చేసిన మెహరీన్‌ ఈ మధ్యన సిల్వర్‌ స్క్రీన్‌పై ఎక్కువగా కనిపించడం లేదు. అయితే సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది మెహరీన్‌. పీరియాడిక‌ల్ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ వెబ్‌ సిరీస్‌లో పంజాబీ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్ర పోషించింది. మిలన్ లుత్రియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో తాహిర్ రాజ్ భాసిన్, అనుజ్ శర్మ, మౌని రాయ్, అనుప్రియ గోయెంకా, హర్లీన్ సేథి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అర్నాబ్ రే రచించిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసెన్షన్’ అనే పుస్తకం ఆధారంగా ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా సిరీస్‌ తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌లో ఢిల్లీ ఆఫ్‌ సుల్తాన్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్‌ అందుబాటులో ఉంది.

అక్రమంగా ఆయుధాల్ని స‌ర‌ఫ‌రా చేసే ఇద్దరు స్నేహితుల క‌థతో ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. ఇక సిరీస్‌ కథ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లో నివసిస్తున్న అర్జున్ భాటియా ( తాహిర్ రాజ్ భాసిన్ ) కథ ఇది . దేశ విభజన సమయంలో సర్వం కోల్పోయిన అర్జున్ తన తండ్రి చేయి పట్టుకుని ఇండియా వస్తాడు. సర్వం కోల్పోయిన షాక్‌తో మానసిక సమతుల్యం కోల్పోయిన తన తండ్రితో కలిసి శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటాడు. ఇదే సమయంలో అర్జున్ తన హక్కుల కోసం పోరాడుతాడు. మరి అతను ఢిల్లీ అండర్ వరల్డ్ ‘సుల్తాన్’గా ఎలా మారిపోయాడన్నదే సుల్తాన్ ఆఫ్‌ ఢిల్లీ కథ. ఇందులో మెహరీన్‌ సంజన అనే అమ్మాయి పాత్రలో నటించింది.

ఇవి కూడా చదవండి

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహరీన్..

ప్రమోషన్లలో పంజాబీ బ్యూటీ మెహరీన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా