Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్‌ నా కోసం చాలా కష్టపడ్డాడు.. వాడిని అలా అన్నందుకు బూతులు తిట్టారు: సొహైల్‌

గతంలో అఖిల్‌ సార్దక్‌ పలు సార్లు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు సపోర్టుగా మాట్లాడాడు. హౌజ్‌లో అతనని గేలి చేస్తూ మాట్లాడిన తోటి కంటెస్టెంట్లపై ఫైరయ్యాడు. ఇక బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా అమర్‌దీప్‌కు మద్దతుగా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తాజాగా మరో బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన లేటెస్ట్‌ సినిమా బూట్‌ కట్‌ బాలరాజు ప్రమోషన్‌లో మాట్లాడిన సొహైల్‌..

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్‌ నా కోసం చాలా కష్టపడ్డాడు.. వాడిని అలా అన్నందుకు బూతులు తిట్టారు: సొహైల్‌
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 13, 2023 | 3:02 PM

ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న ఈ గేమ్‌ షో ఇప్పటికే ఆరో వారం వీకెండ్‌లోకి వచ్చింది. గత వారం వైల్డ్‌ కార్డ్‌తో కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్‌తో కలిపి మొత్తం 14 మంది హౌజ్‌లో సభ్యులుగా ఉన్నారు. గేమ్స్‌, టాస్కుల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తున్నారు. కాగా గతంలో బిగ్‌ బాస్‌లో సందడి చేసిన సెలబ్రిటీలు ఏడో సీజన్‌ కంటెస్టెంట్లపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. గతంలో అఖిల్‌ సార్దక్‌ పలు సార్లు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు సపోర్టుగా మాట్లాడాడు. హౌజ్‌లో అతనని గేలి చేస్తూ మాట్లాడిన తోటి కంటెస్టెంట్లపై ఫైరయ్యాడు. ఇక బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా అమర్‌దీప్‌కు మద్దతుగా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తాజాగా మరో బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన లేటెస్ట్‌ సినిమా బూట్‌ కట్‌ బాలరాజు ప్రమోషన్‌లో మాట్లాడిన సొహైల్‌ పల్లవి ప్రశాంత్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘నేను నటించిన లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాల కోసం పల్లవి ప్రశాంత్‌ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాల ప్రమోషన్స్‌ కోసం వాడు కనీసం నిద్రపోకుండా శ్రమించాడు. నా రూమ్‌ వద్దకు వచ్చి వాడే ఆ సినిమా ప్రమోషన్స్‌ పనులను చూసుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు సొహైల్‌

‘నేను బిగ్‌బాస్‌ షోను రెగ్యులర్‌గా చూడటం లేదు. అయితే పల్లవి ప్రశాంత్‌ ఆటతీరు బాగుంది. అతను తోటి కంటెస్టెంట్ల పట్ల ఎక్కడ కూడా దురుసు మాటలు మాట్లడలేదు. లూజ్‌ టంగ్‌ కూడా ఉపయోగించలేదు. పల్లవి ప్రశాంత్‌ పెద్దగా చదువుకోలేకపోవచ్చు.. కానీ ఎక్కడా ఇతరుల పట్ల అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తించలేదు. అదే అతనిలో నాకు బాగా నచ్చింది. అయితే పల్లవి ప్రశాంత్‌ గురించి ఒకసారి నా సోషల్‌ మీడియాలో ‘ఫార్మర్‌’ అని మాత్రమే మెసేజ్‌ పెట్టాను. అంతే.. నన్ను తిడుతూ వెంటనే చాలా మెసేజ్‌లు వచ్చాయి. కొందరు నన్ను దొంగ, ఫాల్తు గాడు, ఫ్రాడ్‌ గాడు అంటూ నీచమైన కామెంట్లు చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఈ కారణంగానే బిగ్‌బాస్‌ షో గురించి నేను ఎక్కడా మాట్లడటం లేదు. ఇలాంటి నెగెటివ్‌ కామెంట్స్‌ వల్ల ఒక్కోసారి నేను కూడా ట్రిగ్గర్‌ అవుతాను. అప్పుడు నేను కూడా కొన్ని మాటలు అనవచ్చు. దీనివల్ల ఎదుటి వాళ్లు కూడా బాధపడుతారు. అందుకే ఇవన్నీ ఎందుకు అని దూరంగా ఉంటున్నాను. నాకు బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో అమర్‌ దీప్‌తో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారి పేర్లను చెప్పనందుకు బాధగా ఉండవచ్చు. అయితే అందుకు నేనేమీ చేయలేను’ అని సొహైల్‌ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్