AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRO: ‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’.. టీవీలోకి పవన్‌ ‘బ్రో’.. 54 అడుగుల పవర్ స్టార్ కటౌట్‍తో కౌంట్‍డౌన్

థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసిన బ్రో ఇప్పుడు టీవీలోకి రానుంది. అక్టోబర్‌ 15న జీ తెలుగు ఛానెల్‌లో సాయంత్రం 6 గంటలకు పవన్, సాయి ధరమ్‌ తేజ్‌ల సినిమా ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను జీ తెలుగు ఛానెల్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు జీ తెలుగు ఓ స్వీట్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. హైదరాబాద్‍లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద పవన్‍ కల్యాణ్ 54 అడుగుల భారీ కటౌట్‍ను ఏర్పాటుచేసింది

BRO: 'కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు'.. టీవీలోకి పవన్‌ 'బ్రో'.. 54 అడుగుల పవర్ స్టార్ కటౌట్‍తో కౌంట్‍డౌన్
Pawan Kalyan Cut Out
Basha Shek
|

Updated on: Oct 12, 2023 | 11:49 AM

Share

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ మొదటి సారి కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్‌. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. భారీ అంచనాలతో జులై 28న థియేటరర్లలో విడుదలైన బ్రో సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. మొదటిసారి మామా అల్లుళ్లు కలిసి నటించడం, పవన్ వింటేజ్‌ లుక్స్‌ అండ్‌ సాంగ్స్‌ కు మంచి రెస్పాన్స్‌ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బ్రో భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లోనూ మామా అల్లుళ్ల హంగామా మొదలైంది. ఇక్కడ కూడా బ్రో మూవీకి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో కొన్ని రోజుల పాటు బ్రో టాప్‌ ట్రెండ్‌లో నిలవడం విశేషం. ఇలా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసిన బ్రో ఇప్పుడు టీవీలోకి రానుంది. అక్టోబర్‌ 15న జీ తెలుగు ఛానెల్‌లో సాయంత్రం 6 గంటలకు పవన్, సాయి ధరమ్‌ తేజ్‌ల సినిమా ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను జీ తెలుగు ఛానెల్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు జీ తెలుగు ఓ స్వీట్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. హైదరాబాద్‍లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద పవన్‍ కల్యాణ్ 54 అడుగుల భారీ కటౌట్‍ను ఏర్పాటుచేసింది. అంతేకాదు ఈ భారీ కటౌట్‍కు ఓ కౌంట్‍డౌన్ టైమర్‌ను కూడా సెట్‌ చేశారు. జీ తెలుగు ఛానెల్‌లో బ్రో సినిమా ప్రసారానికి ఇంకా ఎంత సమయం ఉందో ఈ టైమర్‌ చూపిస్తోంది. ప్రస్తుతం పవన్‌ కటౌట్‌ నగరవాసులను ఆకట్టుకుంటోంది. అభిమానులు ఇక్కడ ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బ్రో సినిమా విషయానికి వస్తే.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మెగా మల్టీ స్టారర్‌ సినిమాను నిర్మించారు. తమిళ్‌ హిట్‌ మూవీ వినోదయ సిత్తంను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించారు డైరెక్టర్ సముద్రఖని. రోహిణీ, బ్రహ్మానందం, సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌, అలీ రెజా, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్‌, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో, ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న బ్రో బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

పవన్ కటౌట్ వద్ద ఫ్యాన్స్ సందడి..

 జీ తెలుగులో  బ్రో సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?