Mahalakshmi: ‘అమ్మ తర్వాత మహాలక్ష్మినే.. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు’.. బెయిల్‌పై బయటకు వచ్చిన రవీందర్‌

మొదట మహాలక్ష్మితో పెళ్లి విషయంలో రవీందర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొందరు నెటిజన్లు అతనిని బాడీ షేమింగ్‌ చేశారు. ఇక మహాలక్ష్మి కూడా డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లిచేసుకున్నట్లు ట్రోల్స్‌ చేశారు. అలాగే కొన్నినెలల క్రితం ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని, విడాకులు కూడా తీసుకుంటున్నట్లు పుకార్లు, షికార్లు వచ్చాయి. ఇలా వార్తలు వస్తుండగానే రవీందర్‌పై ఓ పోలీస్‌ కేసు నమోదైంది. అబద్ధపు హామీలు ఇచ్చి ఛీటింగ్ చేశాడంటూ మహాలక్ష్మి భర్తను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు

Mahalakshmi: 'అమ్మ తర్వాత మహాలక్ష్మినే.. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు'.. బెయిల్‌పై బయటకు వచ్చిన రవీందర్‌
Mahalakshmi, Ravindar Chandrasekaran
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2023 | 4:30 PM

ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాత, నటి మహాలక్ష్మి భర్త రవీందర్‌ చంద్రశేఖరన్‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుమారు ఏడాదిన్నర క్రితం మహాలక్ష్మి శంకర్‌తో ఏడడుగులు వేసిన రవీందర్‌.. అప్పటి నుంచి ఏదో ఒక కారణంతో తరచూ అతని పేరు వినిపిస్తూనే ఉంది. మొదట మహాలక్ష్మితో పెళ్లి విషయంలో రవీందర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొందరు నెటిజన్లు అతనిని బాడీ షేమింగ్‌ చేశారు. ఇక మహాలక్ష్మి కూడా డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లిచేసుకున్నట్లు ట్రోల్స్‌ చేశారు. అలాగే కొన్నినెలల క్రితం ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని, విడాకులు కూడా తీసుకుంటున్నట్లు పుకార్లు, షికార్లు వచ్చాయి. ఇలా వార్తలు వస్తుండగానే రవీందర్‌పై ఓ పోలీస్‌ కేసు నమోదైంది. అబద్ధపు హామీలు ఇచ్చి ఛీటింగ్ చేశాడంటూ మహాలక్ష్మి భర్తను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో బాగా డబ్బు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీని రవీందర్‌ మోసం చేశాడని ఆరోపణలున్నాయి. ఇందుకోసం అతని దగ్గరి నుంచి రూ. 15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడని చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు అందింది. దీంతో కొన్ని రోజుల క్రితం చెన్నై పోలీసులు రవీందర్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో బెయిల్‌ దొరకడంతో మూడు రోజుల క్రితమే మహాలక్ష్మి భర్త భయటకు వచ్చాడు.

ఇదిలా ఉంటే రవీందర్‌ జైలు కెళ్లిన సమయంలో మహాలక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. రవీందర్‌ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, పెళ్లికి ముందు తన సమస్యలను ఏవీ తనతో చెప్పలేదని బుల్లితెర నటి సంచలన కామెంట్స్‌ చేసింది. ఈక్రమంలోనే జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన రవీందర్‌ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ‘అమ్మ తర్వాత నా లైఫ్‌ లో మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె నాకు దొరికిన వరం. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. ఎవరైనా మమ్మల్ని తిట్టుకోనివ్వండి. ట్రోల్స్‌ చేసుకోండి. కానీ మమ్మల్ని వేరు చేయలేరు’ అంటూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

ట్రోల్స్‌ చేసుకోండి..

అలాగే ఛీటింగ్‌ కేసు గురించి మాట్లాడుతూ త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ‘నేను చెప్పేది కూడా వినకుండా పోలీసులు అరెస్ట్‌ చేసి లాక్కెళ్లారు. జైలులో కింద కూర్చోమన్నారు. అయితే అందుకు నా బాడీ సహకరించలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నా మీద తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తే ఎన్నో దొంగతనాలు చేశాడు. అవన్నీ నాకు తెలియడంతోనే నాపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించాడు. అతని బండారం మొత్తం బయటపెడతాను. నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు రవీందర్‌

నేను ఏ తప్పూ చేయలేదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.