Daggubati Venkatesh: హీరో వెంకటేష్ సింగర్‌గా మారి పాడిన పాట ఎదో మీకు తెలుసా..?

చిరంజీవి, బాలయ్య, నాగార్జున తో పాటు వెంకటేష్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది వెంకటేష్ పేరే. యంగ్ హీరోలతో కలిసి వెంకటేష్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలే కాదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతోనూ కలిసి సినిమాలు చేసి మెప్పించారు వెంకటేష్.

Daggubati Venkatesh: హీరో వెంకటేష్ సింగర్‌గా మారి పాడిన పాట ఎదో మీకు తెలుసా..?
Venkatesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 14, 2023 | 11:34 AM

టాలీవుడ్ సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు మేము ఏమాత్రం తక్కువ కాదు అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున తో పాటు వెంకటేష్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది వెంకటేష్ పేరే. యంగ్ హీరోలతో కలిసి వెంకటేష్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలే కాదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతోనూ కలిసి సినిమాలు చేసి మెప్పించారు వెంకటేష్. నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన వెంకీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు అందరు హీరోల అభిమానులు వెంకీ సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన వెంకీ. సింగర్ గాను తన ప్రతిభ చాటారు.

వెంకటేష్ ఏ సినిమాలో పాట పాడారో తెలుసా.. గురు సినిమా కోసం వెంకటేష్ మొదటి సారి తన గొంతు సవరించారు. సుధా కొంగరు దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సినిమా గురు. ఈ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా కనిపించారు. ఈమూవీలో హీరోయిన్ గా రితికా సింగ్ నటించింది.

ఈ మూవీలో వెంకటేష్ ఓ సాంగ్ ఆలపించారు. గురు సినిమాలో జింగిడి జింగిడి అనే సాంగ్ ను వెంకీ పాడారు. మద్యం గొప్పతనం గురించి చెప్తూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు వెంకటేష్ సైంధవ్ అనే సినిమాలో నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వెంకీ సరసన శ్రధశ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. మెడికల్ మాఫీయా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అలాగే సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సైంధవ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెంకటేష్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.