Anchor Suma: 82 ఏళ్ల వయసులో జిమ్‏లో వర్కౌట్స్.. తల్లి వీడియో షేర్ చేసిన యాంకర్ సుమ..

ఇప్పుడు యూట్యూబ్‏లోనూ సొంత ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఒక రోజులో తన షూటింగ్ అప్డేట్స్ నుంచి.. షాపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అంటూ బాగానే సందడి చేసింది. ఇక ఇంట్లో తన భర్త, పిల్లల గురించి కూడా ఫన్నీ వీడియోస్ పంచుకున్నారు. అలాగే అప్పుడప్పుడు తన తల్లి గురించి చెబుతూ కొన్ని వీడియోస్ షేర్ చేసేది. అంతేకాకుండా ఆమె తల్లిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక తాజాగా సుమ తన మదర్ జిమ్ లో వర్కౌట్స్ చేసే వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Anchor Suma: 82 ఏళ్ల వయసులో జిమ్‏లో వర్కౌట్స్.. తల్లి వీడియో షేర్ చేసిన యాంకర్ సుమ..
Suma
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 13, 2023 | 5:19 PM

బుల్లితెరపై యాంకర్ సుమ ఎంతగా గుర్తింపు సంపాదించుకున్నారో తెలిసిందే. చలాకీతనంతో, సరదా మాటలతో తనదైన యాంకరింగ్ స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ యాంకర్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ సినిమా ఈవెంట్ అయినా.. ప్రమోషన్ ఇంటర్వ్యూస్ అయినా సుమ ఉండాల్సిందే. అంతగా అభిమానులను సొంతం చేసుకున్నారు సుమ. ఇప్పుడు యూట్యూబ్‏లోనూ సొంత ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఒక రోజులో తన షూటింగ్ అప్డేట్స్ నుంచి.. షాపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అంటూ బాగానే సందడి చేసింది. ఇక ఇంట్లో తన భర్త, పిల్లల గురించి కూడా ఫన్నీ వీడియోస్ పంచుకున్నారు. అలాగే అప్పుడప్పుడు తన తల్లి గురించి చెబుతూ కొన్ని వీడియోస్ షేర్ చేసేది. అంతేకాకుండా ఆమె తల్లిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక తాజాగా సుమ తన మదర్ జిమ్ లో వర్కౌట్స్ చేసే వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మీరు వర్కౌట్స్ చేయకుండా ఉండేందుకు ఏమైనా కారణాలున్నాయా ?… మా అమ్మను చూడండి. ఆమెకు 82 ఏళ్ల వయసులోనూ ప్రతి రోజు వ్యాయమం, జిమ్ లో వర్కవుట్స్ చేస్తుంటారని చెబుతూ తన ఇన్ స్టాలో తన మదర్ వర్కవుట్స్ చేస్తోన్న వీడియోను షేర్ చేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. 82 ఏళ్ల వయసులోనూ చురుగ్గా జిమ్ లో వర్కవుట్స్ చేస్తుందని.. ఆమె డెడికేషన్ కు సలాం కొట్టేస్తున్నారు.. మీ మదర్ లాగే మీరు 90లలో ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వచ్చి ఇలా పరిగెడతారని ఆశిస్తున్నానంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సుమ కొడుకు హీరోగా సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. రోషన్ కనకాల హీరోగా నటించిన సినిమా బబుల్ గమ్. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి.. తన కొడుకు సినిమా టీజర్ లాంచ్ వేడుకలోనూ సుమ హోస్ట్ చేసింది. ఈ వేదికపై సుమ, రాజీవ్ కనకాల సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ వేడుకకు సుమ తల్లి కూడా హాజరయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?