Bigg Boss 7 Telugu: శోభాపై రివేంజ్ తీర్చుకున్న యావర్.. అమర్‏దీప్‏కు షాకిచ్చిన తేజ.. మోనితా ఏడుపు..

అంతకు ముందు వీక్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయాలంటే నువ్వు నన్ను తప్పించావ్ అంటూ రీజన్ చెప్పేశాడు. ఇంకేముంది ఒక్కసారిగా శోభాను మోనితా ఆవహించేసింది. చప్పట్లు కొడుతూ.. ఏడుస్తూ నానా హంగామా సృష్టించింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో అసలేం జరిగింది ? అనేది చూద్ధాం. ప్రోమోలో.. కెప్టెన్సీ కంటెండర్స్ తమకు ఇచ్చిన బల్బ్ లను ధరించి మిగతా ఇంటి సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తూ తమ బలూన్ కాపాడుకోవాలని సూచించాడు బిగ్‏బాస్.

Bigg Boss 7 Telugu: శోభాపై రివేంజ్ తీర్చుకున్న యావర్.. అమర్‏దీప్‏కు షాకిచ్చిన తేజ.. మోనితా ఏడుపు..
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 13, 2023 | 7:21 PM

ఆరోవారం కెప్టెన్సీ కంటెండర్ కోసం పోటీ పడుతున్నారు హౌస్మేట్స్. ఆటగాళ్లు, పోటుగాళ్లు టీంలలో కెప్టెన్ అయ్యేందుకు వరసు టాస్కులు ఇస్తున్నారు బిగ్‏బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో శోభా పై రివేంజ్ తీర్చుకున్నాడు యావర్. అంతకు ముందు వీక్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయాలంటే నువ్వు నన్ను తప్పించావ్ అంటూ రీజన్ చెప్పేశాడు. ఇంకేముంది ఒక్కసారిగా శోభాను మోనితా ఆవహించేసింది. చప్పట్లు కొడుతూ.. ఏడుస్తూ నానా హంగామా సృష్టించింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో అసలేం జరిగింది ? అనేది చూద్ధాం. ప్రోమోలో.. కెప్టెన్సీ కంటెండర్స్ తమకు ఇచ్చిన బల్బ్ లను ధరించి మిగతా ఇంటి సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తూ తమ బలూన్ కాపాడుకోవాలని సూచించాడు బిగ్‏బాస్. అయితే ఈ టాస్క్ కేవలం ఆటగాళ్లకు మాత్రమే ఉన్నట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది.

ఇందులో ముందుగా సందీప్ మాస్టర్ శివాజీ బలూన్ పగలగొడుతూ అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆటలో అంతగా పర్ఫామెన్స్ కనిపించలేదంటూ ప్రియాంక బలూన్ పగలగొట్టేశాడు పల్లవి ప్రశాంత్. దీంతో గేమ్ మాత్రమే కాదన్నది ప్రియాంక. ఆ తర్వాత ఇక ఆ తర్వాత ప్రశాంత్ సైతం గేమ్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత సందీప్ కు ఆరు వారాల ఇమ్యూనిటీ దొరికిందని.. అందుకే ఈసారి ఛాన్స్ ఇవ్వాలనుకోవడం లేదంటూ అతని బలూన్ తీసేసింది శోభా.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇత ఆ తర్వాత అంతకు ముందు గేమ్ లో తనను వీక్ కంటెస్టెంట్ అని టాస్క్ నుంచి తప్పించినందుకు మోనితా పై రివెంజ్ తీర్చుకున్నాడు యావర్. ఆ కారణాన్ని చెబుతూ శోభా బెలూన్ పగలగొట్టేశాడు. దీంతో మోనితాగా మారిపోయింది శోభా. చప్పట్లు కొడుతూ.. నేను వీక్ ఆ అంటూ అరుస్తూ నానా హంగామా చేసింది. ఇక చివరికి తేజ, యావర్, అమర్ దీప్ ముగ్గురు మిగిలారు. దీంతో చాలా తెలివిగా అర్జున్ అంబటి తేజను సెలక్ట్ చేస్తూ.. మిగతా ఇద్దరిలో ఎవరిని తప్పించాలో చాన్స్ ఇచ్చాడు. ఇప్పటివరకు జరిగినవన్ని గుర్తుపెట్టుకుని నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు తీసుకుంటావో.. లేదా జనాల దృష్టిలో హీరో అయ్యేందుకు తీసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఇక పక్కనే కూర్చున్న శోభా.. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది. చప్పట్లు కొడుతూ.. ఆడు ఆడు అంటూ పరొక్షంగా యావర్ ను తప్పించు అంటూ హింట్ ఇచ్చింది. ఇక చివరగా తేజ అమర్ దీప్ బెలూన్ పగలగొట్టడంతో సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ రెచ్చిపోయింది. కర్మ రిపీట్స్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి బిగ్‏బాస్ సెకండ్ వీక్ కెప్టెన్ గా యావర్ గెలిచినట్లుగా తెలుస్తోంది.