Bigg Boss 7 Telugu: వామ్మో.. నీకన్నా అమర్ దీప్ నయం.. రైతు బిడ్డపై విషం కక్కిన అర్జున్..

హౌస్ లోకి అడుగుపెట్టడంతోనే అమర్ దీప్ ను నామినేట్ చేసి ఆశ్చర్యపరిచాడు. అతడిని నామినేట్ చేస్తూ అర్జున్ చెప్పిన పాయింట్స్.. ఆ తర్వాత అతడు గేమ్ ఆడే విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో వచ్చిన నాలుగు రోజుల్లోనే అర్జున్ పై పాజిటివిటీ టాక్ వచ్చేసింది. కానీ అంతలోనే అర్జున్ తన మాస్క్ తీసేసినట్లుగా కనిపిస్తుంది. గురువారం రాత్రి లైవ్ లో రైతు బిడ్డపై విషాన్ని కక్కాడు. హౌస్ లో అర్జున్ ఏదో సలహా ఇస్తే ప్రశాంత్ తీసుకోలేదట.

Bigg Boss 7 Telugu: వామ్మో.. నీకన్నా అమర్ దీప్ నయం.. రైతు బిడ్డపై విషం కక్కిన అర్జున్..
Arjun, Prashanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 13, 2023 | 3:04 PM

బిగ్‏బాస్ సీజన్ 7 ఆరో వారం కొనసాగుతుంది. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విడదీసి గేమ్ ఆడిస్తున్నాడు బిగ్‏బాస్. ఇక హౌస్‏లో మొదటి కెప్టెన్‏గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ గా ప్రశాంత్ బాధ్యతలు నిర్వర్తించడం లేదని.. కెప్టెన్ బ్యాడ్జ్ లాగేసుకొని.. ఆ తర్వాత యాక్టివిటి రూంకు పిలిచి మాట్లాడి తిరిగి కెప్టెన్ బ్యాడ్జ్ అందించారు బిగ్‏బాస్. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఇంకా రైతు బిడ్డను టార్గెట్ చేస్తున్నారు సీరియల్ బ్యాచ్. మొన్నటివరకు అమర్ దీప్, సందీప్ ఇద్దరూ టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాటలు విసిరారు. అతను గేమ్ ఆడినా రాంగ్ అంటూ.. కొడుతున్నాడు..అంటూ విమర్శించారు. అమర్ దీప్ మాత్రం ప్రశాంత్ ఏం చేసినా తప్పే అన్నట్లు మాట్లాడుతూ..నువ్వెంట్రా అన్నట్లుగా బిహేవ్ చేయడంతో ప్రతి వారం నాగార్జున చేతిలో తిట్లు తినడం చూశాం. ఇప్పుడిప్పుడే అమర్ దీప్ తన ఆట తీరును మార్చుకుంటున్నాడు. ఎదుటివాళ్ల కోసం కాదు తన కోసం గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే పల్లవి ప్రశాంత్‏తో సైతం తన స్నేహాన్ని పెంచుకోవడానికి.. అతని వెన్నంటే ఉండేదుకు ట్రై చేస్తున్నట్లుగా తెలస్తోంది. కానీ అటు కొత్తగా వచ్చిన అర్జున్‏కు ప్రశాంత్ గెలుపు మింగుడు పడనట్లుగా తెలుస్తోంది.

హౌస్ లోకి అడుగుపెట్టడంతోనే అమర్ దీప్ ను నామినేట్ చేసి ఆశ్చర్యపరిచాడు. అతడిని నామినేట్ చేస్తూ అర్జున్ చెప్పిన పాయింట్స్.. ఆ తర్వాత అతడు గేమ్ ఆడే విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో వచ్చిన నాలుగు రోజుల్లోనే అర్జున్ పై పాజిటివిటీ టాక్ వచ్చేసింది. కానీ అంతలోనే అర్జున్ తన మాస్క్ తీసేసినట్లుగా కనిపిస్తుంది. గురువారం రాత్రి లైవ్ లో రైతు బిడ్డపై విషాన్ని కక్కాడు. హౌస్ లో అర్జున్ ఏదో సలహా ఇస్తే ప్రశాంత్ తీసుకోలేదట. దీంతో సీరియల్ హీరోకు కోపం వచ్చేసింది. గౌతమ్ దగ్గర కూర్చొని ప్రశాంత్ పై నోటికొచ్చింది మాట్లాడాడు. ‘ను సలహా ఇస్తే లైట్ తీసుకున్నాడు. ఒక్క టాస్క్ ఏదైనా పడనీ చెప్తా. మొన్న కలర్ టాస్కులో మొత్తం మడతపెట్టేసి ఉండాల్సింది. ఎందుకు వదిలేశావ్ ?.. ఆ టాస్కులో మడతపెట్టేయాల్సింది. అప్పుడు వీడు ఆడుతాడు.. వీడు ఆడుతాడు అనే మాటనే ఎగిరిపోయేది’ అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్. ఇక అతని మాటలు విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు.

మొదటి రోజు నుంచి ప్రతి ఒక్కరి గురించి పాయింట్ పాయింట్ మాట్లాడుతూ.. టాస్కులోనూ సహనంగా ఉంటూ అందరితో కలిసిపోయాడు అర్జున్. కానీ అంతలోనే రైతుబిడ్డ గెలుపు మింగుడుపడడం లేదని లైవ్ లో అర్జున్ మాటలు వింటే తెలుస్తోందని అంటున్నారు. నీకన్నా అమర్ దీప్ నయం. ప్రశాంత్ పై అరిచి నెగిటివ్ అయ్యాడు. కానీ ఇలా నటించలేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.