90s Web Series OTT: బిగ్‌ బాస్‌ శివాజీ, ‘తొలి ప్రేమ’ వాసుకీల నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రముఖ నటుడు, బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పెద్దన్న శివాజీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్‌ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్‌ సిరీస్‌లో శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ అనేది ఈ సిరీస్‌ క్యాప్షన్‌. 'తొలి ప్రేమ' సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ సతీమణిగా నటించనుంది. తాజాగా నైంటీస్‌ వెబ్‌ సిరీస్..

90s Web Series OTT: బిగ్‌ బాస్‌ శివాజీ, 'తొలి ప్రేమ' వాసుకీల నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
90s Web Series In Ott
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2023 | 11:24 AM

ప్రముఖ నటుడు, బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పెద్దన్న శివాజీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్‌ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్‌ సిరీస్‌లో శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ అనేది ఈ సిరీస్‌ క్యాప్షన్‌. ‘తొలి ప్రేమ’ సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ సతీమణిగా నటించనుంది. తాజాగా నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి వాసుకీ ఫస్ట్‌ రిలీజ్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో మ్యాథ్స్‌ టీచర్‌ చంద్రశేఖర్‌ అనే పాత్రలో శివాజీ నటిస్తుండగా, అతని భార్య శోభారాణి పాత్రలో నటి వాసుకీ కనిపించనుంది. ‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక స్ట్రిక్ట్‌ మ్యాథ్స్‌ టీచర్‌ ఉంటారు. అలాంటి మ్యా్థ్స్‌ టీచరే ఈ మన చంద్ర శేఖర్‌’ అంటూ శివాజీ లుక్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. ‘ఇక మిసెస్‌ శోభారాణితో అంత ఈజీ కాదు. స్ట్రిక్ట్‌ మ్యాథ్స్‌ టీచర్‌నే షేక్ చేసే శోభారాణి. దీపావళికి కలుద్దాం’ అంటూ నటి వాసుకీ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వనపర్తి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ దీపావళికి రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో నవంబర్‌ రెండో వారంలో నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానుందని తెలుస్తోంది.

నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌కు ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నాడు. వాసంతిక మచ్చ, మౌళి, స్నేహల్ కామత్, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. అజీమ్‌ మొహమ్మద్‌ కెమెరామెన్‌గా, గాంధీ నడికుడియార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. శ్రీధర్‌ సోంపల్లి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే షర్వీన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేయనున్నారు. కాగా తొలిప్రేమ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్న వాసుకీ ఇటీవలే అన్ని మంచి శకునములే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తమిళ్‌లో కూడా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌తో మరోసారి మనల్ని అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో త్వరలోనే  ఈ నైంటీస్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్‌, స్ట్రీమింగ్‌ డేట్‌ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

దీపావళికి నైంటీస్ వెబ్ సిరీస్..

View this post on Instagram

A post shared by ETV Win (@etvwin)

లెక్కల మాస్టారుగా శివాజీ..

View this post on Instagram

A post shared by ETV Win (@etvwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..