Renu Desai: ‘ నా కొడుకును సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని నాకూ ఉంది.. కానీ..’ అకిరా నందన్ సినిమా ఎంట్రీపై రేణు దేశాయ్
రావణాసుర సినిమా తర్వాత మాస్ మాహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వర్ రావు'. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ వంశీ. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కాగా చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. ఇప్పుడు ఈ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు
రావణాసుర సినిమా తర్వాత మాస్ మాహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర్ రావు’. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ వంశీ. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కాగా చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. ఇప్పుడు ఈ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బడుగు జీవుల వెలుగు కిరణం హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుంది. ఈ సినిమా అక్టోబర్ 20న అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటోంది రేణు దేశాయ్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటోంది. కాగా రేణూదేశాయ్ తనయుడు అకీరానందన్ సినిమాల్లోకి రానున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై కూడా స్పందించారామె. అకీరా సినిమా ఇంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా. తన కొడుకుని బిగ్ స్క్రీన్ పై చూడాలని ప్రతి తల్లికి వుంటుంది. నాకు కూడా వుంది. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి. తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీ లు తనలో వున్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న, పెదనాన్న యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకూ వుంటుంది.’ అని రేణూదేశాయ్ తెలిపింది. ఇక టైగర్ నాగేశ్వర రావు సినిమాపై స్పందిస్తూ.. ‘ ఇప్పటివరకూ నేను పని చేసిన నిర్మాణ సంస్థలన్నీ చాలా గౌరవంగా చూశాయి. అయితే టైగర్ నాగేశ్వరరావు లో నేను హీరోయిన్ కాదు. దీంతో పాటు చాలా రోజుల తర్వాత నటిస్తున్నాను. ట్రీట్మెంట్ ఎలా వుంటుందో అని కాస్త భయపడ్డాను. అయితే అభిషేక్ భయ్యా, అర్చన ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా అయిపోయారు. ఎంతో గౌరవంగా మర్యాదగా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ సినిమా జరిగినంత కాలం నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్ ఇక నటన కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ‘నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే వుంటుంది. నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను’ అని చెప్పుకొచ్చిందీ సీనియర్ నటీమణి.
టైగర్ నాగేశ్వర్ రావు లో రేణు దేశాయ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.