Bigg Boss 7 Telugu: పాట బిడ్డ పెట్టె సర్దుకోవాల్సిందేనా? డేంజర్‌ జోన్‌లో ఎవరున్నారని మీరనుకుంటున్నారు?

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ టీవీ రియాలిటీ షో సక్సెస్‌ ఫుల్‌గా ఏడో వారంలోకి ప్రవేశించింది. ఆరోవారం వీకెండ్‌లో నయని పావని ఎలిమినేట్‌ కాగా ఇప్పుడు మొత్తం 13 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో మిగిలారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో టేస్టీ తేజా, ప్రియాంక జైన్, సందీప్, శోభా శెట్టి, పూజా మూర్తి

Bigg Boss 7 Telugu: పాట బిడ్డ పెట్టె సర్దుకోవాల్సిందేనా? డేంజర్‌ జోన్‌లో ఎవరున్నారని మీరనుకుంటున్నారు?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 17, 2023 | 5:57 PM

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ టీవీ రియాలిటీ షో సక్సెస్‌ ఫుల్‌గా ఏడో వారంలోకి ప్రవేశించింది. ఆరోవారం వీకెండ్‌లో నయని పావని ఎలిమినేట్‌ కాగా ఇప్పుడు మొత్తం 13 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో మిగిలారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో టేస్టీ తేజా, ప్రియాంక జైన్, సందీప్, శోభా శెట్టి, పూజా మూర్తి, అశ్విని శ్రీ, గౌతమ్, భోలే షావలిలు, పల్లవి ప్రశాంత్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ప్రముఖ సింగర్‌ భోలే షా వళి డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బయట ఉన్నట్లే హౌజ్‌లోనూ ఉండడం, టాస్కుల్లో పెద్దగా పాల్గొనకపోవడం అతనికి మైనస్‌గా మారిందని తెలుస్తోంది. దీనికి తోడు హౌజ్‌లోని కంటెస్టెంట్ల్స్‌లో ఎక్కువ మంది పాట బిడ్డనే నామినేట్‌ చేశారు. దీంతో అతనే ఈ వారం హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇక అతనితో పాటు అశ్విని శ్రీ కూడా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈమె హౌజ్‌లో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఒక్కోసారి నవ్వుతుంది. మరొక్కసారి ఏడుస్తుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అసలు తెలియడం లేదు. దీంతో సోషల్‌ మీడియాలో అశ్వినీపై ట్రోలింగ్‌ నడుస్తోంది. ఇక నిన్నటి నామినేషన్స్ లో కూడా హౌస్ లో ప్రతి ఒక్కరు బోళే షావళి, అశ్విని శ్రీలనే టార్గెట్ చేశారు. తమతో సరిగా కలవలేకపోతున్నారంటూ కుండబద్దలు కొట్టి మరీ నామినేట్‌ చేశారు.

ఇక నామినేషన్స్‌ లిస్టులో ఉన్న పల్లవి ప్రశాంత్ ఈ వారం కూడా సేఫ్‌ అయినట్టేనని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో అతనికి భారీగా సపోర్టు వస్తోంది. అలాగే టేస్టీతేజా కూడా సేఫ్‌ జోన్‌లోకి వచ్చినట్లు సమాచారం. కాగా సోషల్ మీడియా వేదికగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకునున్నారో ఓటు వేయండి. డేంజర్ జోన్ లో ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని మీరనుకుంటున్నారో.. ఈ క్రింద టీవీ 9 ట్విట్టర్ ద్వారా తెలపండి.

ఇవి కూడా చదవండి

టీవీ 9 ట్విట్టర్ పోల్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!