- Telugu News Photo Gallery Spiritual photos Tirupati Brahmotsavam 2023: Mohini Avatar, Garuda Vahana Seva today at 6.30 pm
Tirumala: మోహిని అవతారంలో దర్శనం ఇచ్చిన శ్రీవారు.. రాత్రి గరుడవాహన సేవ.. భారీగా భక్తులు వస్తారని అంచనా..
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు.. ఉదయం 8 గంటలకు మలయప్ప స్వామి మోహినీరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిచ్చారు. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని.. తన భక్తులు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో తన భక్తులకు మోహినీరూపంలో తెలియజేస్తాడని విశ్వాసం.
Updated on: Oct 19, 2023 | 8:52 AM

ఈ రోజు సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడసేవ జరగనుంది. గరుడ వాహన సేవను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. గరుడ సేవలో స్వామివారిని దర్శించుకోవడానికి గ్యాలరీలు అన్నీ నిండిపోతాయి.

దీంతో గరుడ వాహనంపై ఊరేగే స్వామివారిని ఎక్కువమంది భక్తులు దర్శించుకునే కల్పించాలనే ఉద్దేశంతో టీడీపీ వాహన సేవ సమయాన్ని మార్చింది. 6.30 గంటలకు గరుడ వాహన సేవ జరుగనుంది.

జగన్నాటక సూత్రధారి మలయప్ప స్వామి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులందరికీ దర్శనం కల్పించేలా గరుడ సేవ రాత్రి 12 గంటల వరకూ కొనసాగనుంది.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం సాయంత్రం శ్రీ మలయప్ప నాలుగు మాడ వీధుల్లో తన భక్తులను అనుగ్రహించేందుకు గజేంద్ర మోక్ష అలంకారం చేశారు. సర్వభూపాలుడు అంటే విశ్వ చక్రవర్తి. గ్రహాల గమనాన్ని నిర్దేశించేవాడు. శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ విశ్వ ప్రభువుగా విశ్వసిస్తారు. ఆరాధిస్తారు.


క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.

వాహనసేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.





























