AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2023: నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతగా అమ్మవారు.. ఇలా పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయి

విశ్వాసాల ప్రకారం అమ్మవారైన స్కందమాతకు తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో  పూజ సమయంలో తెల్లని వస్త్రాలు ధరించి మాతృమూర్తిని పూజించండి. అంతే కాకుండా అమ్మవారికి అరటిపండ్లు సమర్పించండి. అంతేకాదు అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పించండి. దీంతో అమ్మవారు సంతసించి భక్తులను ఆశీర్వదిస్తుంది.

Navaratri 2023: నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతగా అమ్మవారు.. ఇలా పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయి
Skandmata
Surya Kala
|

Updated on: Oct 20, 2023 | 8:23 AM

Share

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజూ దుర్గాదేవి ఐదవ రూపమైన స్కందమాతను పూజిస్తారు. స్కందమాతను నిర్మలమైన హృదయంతో పూజించే ఏ భక్తుడైనా జ్ఞానాన్ని పొందుతాడని నమ్ముతారు. దుర్గాదేవి ఐదవ రూపం స్కందాదేవి..  స్కంద కుమారుడు అంటే స్వామి కార్తికేయుని  తల్లి పార్వతీదేవి స్కంద మాతగా కీర్తింపబడుతూ పూజలను అందుకుంటుంది. దుర్గాదేవిని  స్కంద మాత గా పిలుస్తారు.

స్కందమాత చిత్రాలలో స్వామి కార్తికేయుడి బాల రూపమైన స్కందదేవత తన తల్లి ఒడిలో కూర్చున్నట్లు చూడవచ్చు. సంతానం కలగడానికి స్కందమాత ఆరాధన ఉత్తమమైనది. తల్లి సింహం మీద పద్మాసనంపై కూర్చుంటుంది, అందుకే ఆమెను పద్మాసినీ అని కూడా పిలుస్తారు. తల్లి స్కందమాత ఇతర పేర్లు పార్వతి, ఉమ, గౌరీ , మహేశ్వరి.

స్కందమాతకు ఇష్టమైన రంగు

విశ్వాసాల ప్రకారం అమ్మవారైన స్కందమాతకు తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో  పూజ సమయంలో తెల్లని వస్త్రాలు ధరించి మాతృమూర్తిని పూజించండి. అంతే కాకుండా అమ్మవారికి అరటిపండ్లు సమర్పించండి. అంతేకాదు అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పించండి. దీంతో అమ్మవారు సంతసించి భక్తులను ఆశీర్వదిస్తుంది. స్కందమాతను పూజించడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. అమ్మవారి ఆరాధనతో అన్ని కోరికలు నెరవేరతాయని.. అన్ని బాధలను తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

స్కందమాతను ఎలా పూజించాలంటే..

ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. దీని తరువాత తెల్లని బట్టలు ధరించి.. పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచి స్కందమాత విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. అనంతరం చిత్రాన్ని శుద్ధి చేయడానికి గంగాజలాన్ని చిలకరించి ఆపై పుష్పాలను సమర్పించండి. అమ్మవారికి పసుపు, కుంకుమ మొదలైన వాటిని సమర్పించి షోడశోపచార పూజ చేయండి. తల్లికి అరటిపండు లేదా పాయసం నైవేద్యంగా సమర్పించి..  హారతి ఇవ్వండి. అనంతరం స్కదమాత దేవి మంత్రాన్ని జపించండి. తరువాత అందరికీ ప్రసాదం పంపిణీ చేయండి.

స్కందమాత మంత్రం

“ఓం దేవి స్కందమాతాయ నమ: స్కంద పారాయణం కోసం ఒక ప్రార్థన “సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ”

స్కంద మాత శ్లోకం

“యా దేవి సర్వభూతేషూ మా స్కందమాత రూపేన శాస్తిత నమస్తే సేయ నమస్తే సేయ నమస్తే సేయ నమోహ్ నమ: ”

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.