AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna River: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం.. బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా

ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా వేసింది ట్రిబ్యునల్‌. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వాటా నుంచి రెండు తెలుగు రాష్ట్రాల కోటాలు తేల్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్-2కు విధివిధానాలు ఖరారు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

Krishna River: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం.. బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా
Krishna Water Dispute
Surya Kala
|

Updated on: Oct 19, 2023 | 7:00 AM

Share

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. ఏపీ విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ట్రిబ్యునల్‌ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో విచారణకు సిద్ధమైంది బ్రిజేష్ ట్రిబ్యునల్. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై నవంబర్ 15 లోపు అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విచారణ ప్రారంభం కాగానే..కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అధ్యయనం చేయాల్సి ఉందని, దానికి అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దానికి తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం చెప్పింది. నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని కోరింది.

అయితే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా వేసింది ట్రిబ్యునల్‌. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వాటా నుంచి రెండు తెలుగు రాష్ట్రాల కోటాలు తేల్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్-2కు విధివిధానాలు ఖరారు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని ఆ పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, విభజన చట్టం సెక్షన్ 89(A), 89(B) కింద, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉందని గుర్తుచేసింది. ఇప్పుడు కొత్త అంశాలు చేర్చి వాటాలు పంచాలని సూచించడంపై ఏపీ సర్కార్‌ అభ్యంతరం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..