గాజాలో దీనస్థితి.. అనస్థీషియా లేకుండానే శస్త్ర చికిత్స.. క్షతగాత్రులను కాపాడేందుకు వైద్యుల కష్టం..

రిసర ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. మృతుల్లో చాలా వరకు చిన్నపిల్లలు ఉన్నారు. వారి చుట్టూ ఉన్న గడ్డి దుప్పట్లు, పాఠశాల బ్యాక్‌ప్యాక్‌లు, ఇతర వస్తువులతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. క్షతగాత్రులను రక్తసిక్తమైన నేలపై పడుకోబెట్టారు. వారు నొప్పితో, బాధతతో అరుపులు, కేకలు వేశారు అని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

గాజాలో దీనస్థితి.. అనస్థీషియా లేకుండానే శస్త్ర చికిత్స.. క్షతగాత్రులను కాపాడేందుకు వైద్యుల కష్టం..
Gaza Hospital Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2023 | 11:09 AM

గాజాలోని ఆసుపత్రిలో పేలుడు సంభవించిన తరువాత, గాయపడిన వారిని రక్షించడానికి వైద్యులు కష్టపడుతున్నారు. ఒక్కసారిగా వెయ్యి మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చేరటంతో వారికి అనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేశరు. మంగళవారం రాత్రి అల్ అహ్లీ హాస్పిటల్ సమీపంలో జరిగిన పేలుడులో 800 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఇప్పటికే గాజా (గాజా స్ట్రిప్) చేరే అన్ని రవాణా మార్గాలు, సౌకర్యాలు నిలిచిపోయాయి. మందుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే శరణార్థులు పెద్దసంఖ్యలో ఆస్పత్రిలో ఉండడంతో క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు స్థలం కరువైంది. క్షతగాత్రులు డాక్టర్ల మీదకు దూసుకోస్తున్నారు.. వారిలో కొందరి శరీరాలు దారుణంగా మంటలకు కాలిపోయాయి. పలువురి చేతులు, కాళ్లు కాలిపోయాయి. వారందరికీ ఆసుపత్రిలో చికిత్స చేసామని వైద్యులు చెబుతున్నారు.

గాజా స్ట్రిప్‌లోని అల్‌-అహీ బాప్టిస్ట్‌ హాస్పిటల్‌ భవనంపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. అక్టోబరు 7న హమాస్‌ దాడి తర్వాత గాయపడిన వేలాది మంది పౌరులతో ఆస్పత్రి కిక్కిరిసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆసుపత్రి భవనంలో భారీ సంఖ్యలో ఆశ్రయం పొందుతున్న పౌరులున్నారు. తాజా దాడితో భవనం మంటల్లో చిక్కుకుంది. పరిసర ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. మృతుల్లో చాలా వరకు చిన్నపిల్లలు ఉన్నారు. వారి చుట్టూ ఉన్న గడ్డి దుప్పట్లు, పాఠశాల బ్యాక్‌ప్యాక్‌లు, ఇతర వస్తువులతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. క్షతగాత్రులను రక్తసిక్తమైన నేలపై పడుకోబెట్టారు. వారు నొప్పితో, బాధతతో అరుపులు, కేకలు వేశారు అని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దాడి అనంతరం ఆసుపత్రి డైరెక్టర్‌ మహ్మద్‌ అబు సెల్మియా మాట్లాడుతూ, తమకు అవసరమైన వైద్య పరికరాలు కావాలన్నారు. మందులు కూడా లేవని చెప్పారు. పడకల కొరత కూడా ఎక్కువగా ఉందన్నారు. అనస్థీషియాతో పాటుగా అత్యవసర సేవలకు కావాల్సిన అన్ని రకాల వైద్య సామాగ్రి అవసరమని చెప్పారు. ఉత్తర గాజాలో 2000 మందికి పైగా ఇన్‌పేషెంట్లకు చికిత్స చేస్తున్న 22 ఆసుపత్రుల తరలింపు కోసం ఇజ్రాయెల్‌ పదేపదే ఆదేశాలను జారీచేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది. రోగులు, ఆరోగ్య కార్యకర్తలను బలవంతంగా తరలించడం ప్రస్తుత మానవతా, ప్రజారోగ్య విపత్తును మరింత దిగజార్చుతుందని పేర్కొంది. తక్షణమే ఇజ్రాయెల్‌ తన తరలింపు ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..